ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను (Q3 results) ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) శనివారం ప్రకటించింది. డిసెంబర్ నెలతో ముగిసే Q3 (Q3FY23) లో బ్యాంక్ అంచనాలను మించి రూ. 8,311.85 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత Q3 (Q3FY22)లో బ్యాంక్ నికర లాభాలు రూ. 6,193.81 కోట్లు.
2022 సెప్టెంబర్ నెలతో ముగిసే రెండో త్రైమాసికంలో (Q2FY23)లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) రూ. 7,557.85 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఈ Q2 తో పోలిస్తే, Q3 (Q3 results) లో బ్యాంక్ (ICICI Bank) నికర లాభాలు 9.97% పెరిగాయి.
ఈ Q3 లో నికర వడ్డీ ఆదాయం (Net interest income) లో బ్యాంక్ (ICICI Bank) గణనీయ మెరుగుదల సాధించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 (ICICI Bank Q3 results) లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (Net interest income) రూ. 12,236 కోట్లు కాగా, ఈ Q3 లో బ్యాంక్ (ICICI Bank) నికర వడ్డీ ఆదాయం (Net interest income) రూ. 16,445 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, 34.6% అధికం. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ (ICICI Bank) రూ. 14,786.81 కోట్ల నికర వడ్డీ ఆదాయం (Net interest income) సంపాదించింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా ఈ Q3లో (ICICI Bank Q3 results) 4.65% పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రావిజన్స్ అండ్ కాంటిజెన్సీస్ ఖర్చు ఈ Q3 లో రూ. 2,267 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం Q3లో రూ. 2,007.30 కోట్లు. ఈ Q2లో ఇది రూ. 1.644.52 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. టర్మ్ డిపాజిట్లలో గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3 results) కన్నా, ఈ Q3 లో 14.2% వృద్ధిని, అలాగే, కరంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లలో 10.4% వృద్ధిని బ్యాంక్ (ICICI Bank) నమోదు చేసింది. మొత్తంగా ప్రస్తుతం బ్యాంక్ వద్ద రూ. 11,22,049 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. శుక్రవారం, జనవరి 20న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) షేర్ విలువ (share value) రూ. 870.40 వద్ధ ముగిసింది.