తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta N Line : క్రేటా ఎన్ ​లైన్​ రెండు వేరియంట్ల మధ్య డిఫరెన్స్​ ఇదే!

Hyundai Creta N Line : క్రేటా ఎన్ ​లైన్​ రెండు వేరియంట్ల మధ్య డిఫరెన్స్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

16 March 2024, 11:56 IST

    • Hyundai Creta N Line : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ కొనాలని చూస్తున్నారా? అయితే.. రెండు వేరియంట్ల మధ్య డిఫరెన్స్​ని ఇక్కడ తెలుసుకోండి..
సరికొత్త హ్యుందాయ్​ క్రేటా ఎన్​లైన్​..
సరికొత్త హ్యుందాయ్​ క్రేటా ఎన్​లైన్​..

సరికొత్త హ్యుందాయ్​ క్రేటా ఎన్​లైన్​..

Hyundai Creta N Line price in Hyderabad : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. భారత మార్కెట్​లో క్రెటా ఎన్ లైన్​ని ఇటీవలే లాంచ్​ చేసింది. ఇది.. స్టాండర్డ్​ క్రేటా కన్నా బోల్డ్​గా, స్పోర్టీగా ఉంది. అయితే.. ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్​లో రెండు వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. అవి.. ఎన్8, ఎన్10. రెండు వేరియంట్లలోనూ ఒకటే (1.5-లీటర్ టర్బో పెట్రోల్) ఇంజిన్​ ఉంది. 6-స్పీడ్ మేన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్ మిషన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ రెండు వేరియంట్స్​ మధ్య డిఫరెన్స్​ని ఇక్కడ చూద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్: సెక్యూరిటీ ఫీచర్లు

క్రెటా ఎన్ లైన్​లో 6 ఎయిర్ బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్​మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-4 డిస్క్ బ్రేక్స్​, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, పాడల్ ల్యాంప్స్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ సైతం ఉన్నాయి.

ఎన్8 వేరియంట్​లో డ్యూయెల్ కెమెరాతో డాష్కామ్, ఎన్10 వేరియంట్​లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్​వీఎం, హ్యుందాయ్ స్మార్ట్సెన్స్ అనే అడ్వాన్స్డ్ డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎన్ 8: ఎక్స్​టీరియర్

Hyundai Creta N Line variants : హ్యుందాయ్​ క్రెటా ఎన్ లైన్.. ఎన్ లోగోతో 18-ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది, రెడ్​ యాక్సెంట్​తో పాటు బంపర్లు మరియు సైడ్​లో ఎన్ లైన్ లోగో వంటివి స్టాండర్డ్​గా వస్తున్నాయి. ఈ ఎస్​యూవీలో ఉన్న లైటింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఎల్​ఈడీ యూనిట్లే. వెనుక భాగంలో ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ యూనిట్, రియర్ స్పాయిలర్ వస్తున్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎన్ 8: ఇంటీరియర్

హ్యుందాయ్​ క్రెటా ఎన్ లైన్​లో.. రెడ్​ యాక్సెంట్​ ఆల్-బ్లాక్ ఇంటీరియర్ స్టాండర్డ్​గా ఉంటుంది. లెథరెట్ సీట్లు, కొత్త గేర్ లివర్, ఎన్ సింబల్​తో కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. స్పోర్టీ అప్పీల్​ను పెంచడానికి, హ్యుందాయ్ మెటాలిక్ పెడల్స్​ను అందిస్తోంది. రియర్ విండో సన్ షేడ్స్, రియర్ పార్శిల్ ట్రే, హైట్ అడ్జెస్టెబుల్ హెడ్ రెస్ట్​లు, 2-స్టెప్స్ రియర్ సీట్ రెక్లైన్, వెనుక సీటు కోసం 60:40 డివైడ్ కూడా ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎన్ 10: ఇంటీరియర్

Hyundai Creta N Line : హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​ ఎన్ 10 ఎస్​యూవీ ట్రిమ్​లో రెడ్ యాంబియంట్ లైటింగ్, హెడ్ రెస్ట్ కోసం రియర్ కుషన్స్, డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రికల్ అడ్జెస్టెబుల్​ వంటివి ఉన్నాయి. వాయిస్ ఎనేబుల్డ్ పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, బోస్ స్పీకర్ సిస్టమ్​తో కూడిన పెద్ద 10.25-ఇంచ్​ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​ను కూడా అందిస్తోంది. ఇన్​స్టుమెంట్ క్లస్టర్, ఓటీఏ అప్డేట్స్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కోసం 10.25 ఇంచ్​ డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది.

తదుపరి వ్యాసం