తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta Ev Spied : సూపర్​ ఫీచర్స్​తో హ్యుందాయ్​ క్రేటా ఈవీ.. లాంచ్​ ఎప్పుడు?

Hyundai Creta EV spied : సూపర్​ ఫీచర్స్​తో హ్యుందాయ్​ క్రేటా ఈవీ.. లాంచ్​ ఎప్పుడు?

Sharath Chitturi HT Telugu

17 March 2024, 18:00 IST

    • Hyundai Creta EV 2024 : హ్యుందాయ్​ క్రేటా ఈవీకి సంబంధించిన ఫొటోలు లీక్​ అయ్యాయి. ఫలితంగా.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై అంచనాలు మరింత పెరిగాయి.
హ్యుందాయ్​ క్రేటా ఇవీ..
హ్యుందాయ్​ క్రేటా ఇవీ..

హ్యుందాయ్​ క్రేటా ఇవీ..

Hyundai Creta EV : హ్యుందాయ్​ క్రేటా ఈవీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై ఇప్పటికే చాలా బజ్​నెలకొంది. ఇక ఇప్పుడు.. క్రేటా ఈవీ మోడల్​..సౌత్​ కొరియాలో దర్శనమిచ్చింది. టెస్ట్​ రన్​ దశలో ఉన్న ఈ మోడల్​.. ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిలప్​పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

హ్యుందాయ్​ క్రేటా ఈవీ..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో క్రేటా ఒకటి. హ్యుందాయ్​కి కూడా ఈ ఎస్​యూవీ.. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​! ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని ఇండియాలో ఇటీవలే లాంచ్​ చేసింది. ఇక దీనికి ఎలక్ట్రిక్​ వర్షెన్​ వస్తుందని ఎప్పటి నుంచే వార్తలు ఉన్నాయి. క్రేటా ఈవీపై టెస్ట్​ రన్​ కూడా చాలాసార్లు జరిగింది.

ఇక తాజాగా కనపడిన స్పై షాట్స్​ ప్రకారం.. ఈ ఎస్​యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తాన్ని కవర్​ చేసే విధంగా.. ఎల్​ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ (డీఆర్ఎల్) ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న క్రెటా ఐసీఈ వేరియంట్ మాదిరిగానే ఈ కారులో ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్​ సహా స్టైలింగ్ అంశాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎలక్ట్రిక్ కారు కావడంతో కొత్తగా లాంచ్ చేసిన క్రెటా ఫేస్​లిఫ్ట్​లో కనిపించే సంప్రదాయ రేడియేటర్ గ్రిల్​కు బదులుగా.. క్లోజ్డ్ ప్యానెల్​ ఉండొచ్చు. ఎలక్ట్రిక్ క్రెటా 17-ఇంచ్​ ఏయిరో-డిజైన్ అలాయ్​ వీల్స్​ పొందుతుందని స్పైషాట్ ద్వారా తెలుస్తోంది. ఇది ప్రత్యేకంగా ఈవీ కోసం తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఐసీఈ వేరియంట్​తో పోల్చితే.. అత్యంత మెరుగైన మార్పుగా దీనిని పరిగణించవచ్చు.

Hyundai Creta EV spied in India : హ్యుందాయ్ క్రెటా ఈవీలో.. రీపోజిషన్డ్ బ్రాండ్ లాగ్, ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్​ ఉండొచ్చు. అలాగే, ట్వీక్డ్ రేడియేటర్ గ్రిల్​తో స్మూత్ బంపర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్​యూవీ సైడ్, రేర్ ప్రొఫైల్​లో డిజైన్ మార్పులను కలిగి ఉంటుందని సమాచారం.

ఫీచర్ల విషయానికొస్తే.. హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్​లో భారీ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కొత్త గ్రాఫిక్స్​తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్, రీ-డెవలప్డ్​ సెంటర్ కన్సోల్​తో వస్తుందని సమాచారం. 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్​లో.. నోస్​ పార్ట్​లో ఫ్రెంట్​ కెమెరా రానుంది.

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్ల గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఇది 55-60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో వస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Hyundai Creta EV spied : ఇక ఈ హ్యుందాయ్​ క్రేటా ఈవీ ఫీచర్స్​, బ్యాటరీ, లాంచ్​ వంటి వివరాలపై త్వరలోనే ఓ అప్టేడ్​ వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ధరపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం