తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: బంగారం ధరకు బ్రేకులు.. స్వల్పంగా తగ్గిన వెండి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

Gold Price Today: బంగారం ధరకు బ్రేకులు.. స్వల్పంగా తగ్గిన వెండి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

18 January 2023, 6:15 IST

    • Gold Price Today: వరుసగా పెరుగుతూపోతున్న బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
నేటి బంగారం, వెండి ధరలు
నేటి బంగారం, వెండి ధరలు

నేటి బంగారం, వెండి ధరలు

Gold Price Today: వరుసగా అయిదు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు నేడు (జనవరి 18) కాస్త బ్రేకులు పడ్డాయి. పసిడి రేట్లు నేడు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం ధర నేడు రూ.52,000గా ఉంది. కిందటి రోజు ధర కొనసాగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు కూడా నేడు స్థిరంగా రూ.56,950 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో..

Gold Price in Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,000గా ఉంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.56,950 వద్ద కొనసాగింది. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం ధరలు ఇలాగే ఉన్నాయి.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో.

Gold Price in Delhi: దేశరాజధాని ఢిల్లీతో పాటు దాదాపు అన్ని నగరాల్లో నేడు పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.52,350గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన తులం పసిడి ధర రూ.57,100 వద్ద కొనసాగింది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.56,950కు చేరింది. కోల్‍కతా, నాగ్‍పూర్, కటక్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Rate Today: బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,250 వద్ద కొనసాగింది. 24 గ్రాముల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,000గా ఉంది. అహ్మదాబాద్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 గ్రాముల 10 గ్రాముల పసిడి ధర రూ.53,050గా ఉంది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.57,870 వద్ద కొనసాగింది.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‍లో పరుగులు పెడుతున్న స్పాట్ గోల్డ్ ధర నేడు కాస్త శాంతించింది. ఔన్సు స్పాట్ గోల్డ్ రేటు సుమారు 9 డాలర్లు తగ్గి 1,908 డాలర్ల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ద్రవ్యోల్బణం డేటా పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. అలాగే మరిన్ని డాలర్ విలువలో అంతర్జాతీయ అంశాల ఎఫెక్ట్ కూడా పడుతోంది.

వెండి ధర స్వల్పంగా డౌన్

Silver Price Today: దేశీయ బులియన్ మార్కెట్‍లో పసిడి ధర నేడు స్థిరంగా కొనసాగగా.. వెండి రేటు మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి.. రూ.72,500కు చేరింది. 100 గ్రాముల ధర రూ.7,250 వద్ద ఉంది.

హైదరాబాద్‍లో నేడు కిలో వెండి ధర రూ.75,300గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నైలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, పుణెలో కిలో వెండి రేటు రూ.72,500గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం