తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

Gold and silver rates today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే

26 December 2022, 6:01 IST

    • Gold and silver rates : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 49,850గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,98,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 4,985గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 54,380గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,43,800గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,438గా ఉంది.

Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,000గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,530గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,850 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 54,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 50,790గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,400గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 49,850గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 54,380గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,380గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,900గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 54,410గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 49,850గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,380గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,110గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 71,100గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rates today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 74,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 71,100.. బెంగళూరులో రూ. 74,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సైతం సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ 27,220గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,220గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం