Sovereign Gold Bond : తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్​..-gold bond issue price fixed at 5 409 per gm of gold subscription opens monday ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Bond Issue Price Fixed At 5,409 Per Gm Of Gold; Subscription Opens Monday

Sovereign Gold Bond : తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్​..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 18, 2022 12:58 PM IST

Sovereign gold bond scheme 2022-23 : సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ సిరీస్​ 3ని ఆర్​బీఐ లాంచ్​ చేసింది. ఆ వివరాలు..

తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్​..
తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్​..

Sovereign gold bond scheme 2022-23 : సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​లోని మరో సిరీస్​ను ప్రకటించింది ఆర్​బీఐ. ఇది సోమవారం ఓపెన్​ అవుతుంది. ఈ నెల 23 వరకు ఈ స్కీమ్​ కోసం సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చు. సబ్​స్క్రిప్షన్​ కోసం ఇష్యూ ప్రైజ్​ను గ్రామ్​కు రూ. 5,409గా నిర్ణయించింది ఆర్​బీఐ.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

"సావరిన్​ గోల్డ్​ బాండ్​ నామినష్​ వాల్యూ గ్రామ్​కు రూ. 5,409గా ఉంటుంది," అని ఆర్​బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

Sovereign gold bond scheme latest news : ఆన్​లైన్​లో అప్లై చేసి, డిజిటల్​ మోడ్​లో పేమెంట్​ చేసే సబ్​స్క్రైబర్స్​కు గ్రామ్​కు రూ. 50 చొప్పున తగ్గింపు లభిస్తోంది. ఆర్​బీఐతో సంప్రదింపులు జరిపిన అనంతరం.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

"ఇలాంటి ఇన్​వెస్టర్లకు గ్రామ్​ బంగారం ధర రూ. 5,359గా ఉంటుంది," అని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

Sovereign gold bond scheme issue price : 2022-23 సావరిన్​ గోల్డ్​ బాండ్​లో ఇది మూడొవ సిరీస్​. నాలుగోవ సిరీస్​.. మార్చ్​ 06-10 మధ్యలో ఓపెన్​ అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

సబ్​స్క్రిప్షన్​ మొదలవ్వడానికి ముందు వారంలో.. గోల్డ్​ బాండ్​ ఇష్యూ ప్రైజ్​ను నిర్ణయిస్తారు. 999 ప్యూరిటీ గోల్డ్​కు సంబంధించి.. ముందు వారంలో మూడు క్లోజింగ్​ ధరలను తీసుకుని యావరేజ్​ చేసిన తర్వాత.. ధరను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఐబీజేఏ(ఇండియ బులియన్​ అండ్​ జ్యువెల్లరీ అసోసియేషన్​ లిమిటెడ్​) ప్రచురించే ధరను పరిగణిస్తారు.

Sovereign gold bond scheme : షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంక్​లు, స్టాక్​ హోల్డింగ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​, క్లియరింగ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​, పోస్టాఫీసులు, ఎన్​ఎస్​ఈ- బీఎస్​ఈలో అమ్ముతారు.

ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ టెన్యూర్​ 8ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత రిడీమ్​ చేసుకునే వెసులుబాటు ఉంది. నామినల్​ వాల్యూపై సెమీ-యాన్యువెల్​గా 2.50శాతం ఫిక్స్​డ్​ వడ్డీ లభిస్తుంది. ఆర్థిక ఏడాదిలో.. గోల్డ్​ బాండ్స్​పై మ్యాగ్జిమం లిమిట్​ 4 కేజీలు. ట్రస్ట్​లకు 20కేజీల వరకు లిమిట్​ ఉంటుంది. ఈ బాండ్స్​తో లోన్​లు కూడా తీసుకోవచ్చు.

Sovereign gold bond series 3 details : 2015 నవంబర్​లో తొలిసారిగా ఈ సావరిన్​ గోల్డ్​ బాండ్​ స్కీమ్​ను లాంచ్​ చేశారు. ఫిజికల్​ గోల్డ్​ను తగ్గించేందుకు, ప్రజల ఫైనాన్షియల్​ సేవింగ్స్​ను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ గోల్డ్​ బాండ్స్​కు డిమాండ్​ నానాటికీ పెరుగుతోంది. వీటిని పెట్టుబడి ఆప్షన్​ కింద ప్రజలు పరిగణించడం మొదలుపెట్టారు.

WhatsApp channel

సంబంధిత కథనం