తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బచత్ సేల్; డిస్కౌంట్లో గూగుల్ పిక్సెల్ 7 ఏ, ఐ ఫోన్ 14.. మరెన్నో

Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బచత్ సేల్; డిస్కౌంట్లో గూగుల్ పిక్సెల్ 7 ఏ, ఐ ఫోన్ 14.. మరెన్నో

HT Telugu Desk HT Telugu

20 May 2023, 19:43 IST

    • Flipkart Sale: ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ను ప్రకటించింది. మే 19  నుంచి మే 21 వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ సేల్ లో గూగుల్ పిక్సెల్ 7 ఏ, ఐఫోన్ 14 తదితర ప్రొడక్ట్స్ తక్కువ ధరకే లభించనున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Flipkart Sale: బిగ్ బచత్ ధమాల్ 2023 సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) పేరుతో ఫ్లిప్ కార్ట్ మరో డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ మే 19 న ప్రారంభమైంది. మే 21 వరకు ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ తో పాటు అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈ సేల్ లో ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

iPhone 14: ఐ ఫోన్ 14

ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) లో 128 జీబీ ఐ ఫోన్ 14 (iPhone 14) రూ. 69,999. లకే లభిస్తుంది. ఈ ఫోన్ ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (HDFC bank credit card) తో కొనుగోలు చేస్తే రూ. 4000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, వర్కింగ్ కండిషన్ లో ఉన్న తమ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 33,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఫోన్ కండిషన్, కంపెనీ, మోడల్ తదితర అంశాలను బట్టి ఈ ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది. ఐ ఫోన్ 14 (iPhone 14) లో 6.1 ఇంచ్ ల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే (Super Retina XDR display) ఉంది. ఇందులో యాపిల్ ఏ 15 బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది. ఇది 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7 ఏ

పిక్సెల్ 7 ఏ (Pixel 7a) ను గూగుల్ (Google) ఇటీవలనే లాంచ్ చేసింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) లో ఈ ఫోన్ రూ. 43,999 లకే లభిస్తుంది. కొటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (Kotak credit card EMI transactions) తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, వర్కింగ్ కండిషన్ లో ఉన్న పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 34,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఫోన్ కండిషన్, కంపెనీ, మోడల్ తదితర అంశాలను బట్టి ఈ ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది. ఈ ఫోన్ డిస్ ప్లే కు గొరిల్లా గ్లాస్ 3 (Gorilla Glass 3) ప్రొటెక్షన్ ఉంది.

Poco F5 5G: పొకొ ఎఫ్ 5

ఈ పొకో ఎఫ్ 5 (Poco F5 5G) స్మార్ట్ ఫోన్ 5 జీ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ వేరియంట్ ఈ ఫ్లిప్ కాార్ట్ సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) లో రూ. 29,999 లకు లభిస్తుంది. కొటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (Kotak credit card EMI transactions) తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 6.67 ఇంచ్ ల FHD+ డిస్ ప్లే ఉంది. దీన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ () లో ఒప్పొ రెనో8 ప్రొ 5జీ (OPPO Reno8 Pro 5G) 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ. 45,999 లకే లభిస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ను అమర్చారు. కొటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ (Kotak credit card EMI transactions) తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, వివో టీ1 ఎక్స్ (Vivo T1X) ఫోన్ ఈ సేల్ (Flipkart Big Bachat Dhamaal Sale) లో రూ 12,999 లకే కొనుగోలు చేయవచ్చు.

తదుపరి వ్యాసం