తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fd Interest Rates: ఎఫ్ డీ లపై 9 శాతం పైగా వడ్డీ అందించే బ్యాంకులు ఇవే..

FD interest rates: ఎఫ్ డీ లపై 9 శాతం పైగా వడ్డీ అందించే బ్యాంకులు ఇవే..

HT Telugu Desk HT Telugu

21 August 2023, 11:19 IST

  • World Senior Citizens Day: సాధారణంగా రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ ఉన్న పెట్టుబడి సాధనాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రిస్క్ ఏ మాత్రం లేని వాటిలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. వారికి బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు అత్యుత్తమ సాధనం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World Senior Citizens Day: డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు (Fixed deposits FD) చేయడం రిస్క్ ఏ మాత్రం లేని సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఈ ఎఫ్ డీలతో కొంతవరకు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అలాగే, దాదాపు అన్ని బ్యాంకులు కూడా సాధాణ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్లకు 0.5% వడ్డీ అదనంగా అందిస్తుంటాయి. దాంతో, సీనియర్ సిటిజన్లు తమ కష్టార్జితాన్ని ఎఫ్ డీ ల రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పెద్ద బ్యాంకుల కన్నా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆగస్ట్ 21 సీనియర్ సిటిజన్స్ డే. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లకు 9% పైగా వార్షిక వడ్డీ రేటు స్మాల్ ఫైనాన్స్ అందించే బ్యాంకులు ఇవే..

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

444 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9% వడ్డీ అందిస్తుంది. ఆగస్ట్ 21 నుంచి ఈ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

2) ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

500 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9%, 750 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9.43%, 1000 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9.21%, 36 నెలల నుంచి 42 నెలల కాల వ్యవధి ఎఫ్ డీలకు 9.15% వడ్డీ అందిస్తుంది. జులై 26, 2023 నుంచే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

3) ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

2 సంవత్సరాల నుంచి మూడేళ్ల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9% వడ్డీ అందిస్తుంది. ఏప్రిల్14 2023 నుంచే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

4) జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

2 సంవత్సరాల నుంచి మూడేళ్ల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9% వడ్డీ అందిస్తుంది. 15,ఆగస్ట్ 2023 నుంచే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

5) నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

555 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9.25%, 1111 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు కూడా 9.25% వడ్డీ అందిస్తుంది. జూన్ 6వ తేదీ నుంచి ఈ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

6) సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

2 సంవత్సరాల నుంచి మూడేళ్ల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9.10% వడ్డీ అందిస్తుంది. 7,ఆగస్ట్ 2023 నుంచే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.15 నెలల నుంచి 24 నెలల ఎఫ్ డీ లకు 9% వడ్డీ అందిస్తుంది.

7) యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

6 నెలల నుంచి 201 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు ఈ బ్యాంక్ 9.25% , 501 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు 9.25%, 1001 రోజుల కాల వ్యవధితో ఉన్న ఎఫ్ డీలకు 9.50% వడ్డీ అందిస్తుంది. 11,ఆగస్ట్ 2023 నుంచే ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

సూచన: స్వీయ విచక్షణతో నిపుణుల సూచనల మేరకు పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం