తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Epfo Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ పునరుద్ధరణ

EPFO Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ పునరుద్ధరణ

30 April 2023, 14:07 IST

    • EPFO Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ పోర్టల్ పునరుద్ధరణ జరిగింది. కొద్ది రోజులుగా పని చేయని పాస్‍బుక్ సర్వీస్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది.
EPFO Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ పునరుద్ధరణ
EPFO Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ పునరుద్ధరణ

EPFO Passbook: ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ పునరుద్ధరణ

EPFO Passbook: కొద్ది రోజులుగా నిలిచిపోయిన ఈపీఎఫ్‍వో ఈ-పాస్‍బుక్ సర్వీస్ ఎట్టకేలకు మళ్లీ పని చేస్తోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పాస్‍బుక్‍ను చందాదారులు (ఉద్యోగులు) ఇప్పుడు ఈపీఎఫ్‍వో (EPFO) వెబ్‍సైట్‍లో యాక్సెస్ చేసుకోవచ్చు. పాస్‍బుక్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‍వోలో ఈ-పాస్‍బుక్ సర్వీస్ నిలిచిపోయిందని వేలాది మంది యూజర్లు సోషల్ మీడియాలో కొంతకాలంగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు పాస్‍బుక్ సేవలు ఈపీఎఫ్‍వో వెబ్‍సైట్‍లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. వివరాలివే.

EPFO Passbook: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనేజేషన్ (EPFO) వెబ్‍సైట్‍లో పాస్‍బుక్ యాక్సెస్ చేసుకునేందుకు వీలు కావడం లేదని వారం రోజులుగా పీఎఫ్ మెంబర్లు.. సోషల్ మీడియా ద్వారా కంప్లైట్స్ చేశారు. పాస్‍బుక్ పేజీ ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ వస్తోందని ఫొటోలతో సహా పోస్ట్ చేశారు. అయితే, కొన్ని ఫిర్యాదులకు ఈపీఎఫ్‍వో స్పందించింది. త్వరలోనే ఈ-పాస్‍బుక్ సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పింది. అయితే, ప్రస్తుతం ఈ-పాస్‍బుక్ సేవలు పని చేస్తున్నాయి. ఈవీఎఫ్‍వో పాస్‍బుక్ ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

ఈపీఎఫ్ ఈ-పాస్‍బుక్‍ను చూడడం/డౌన్‍లోడ్ చేసుకోవడం ఎలా అంటే..

  • ముందుగా ఈపీఎఫ్‍వో అధికారిక వెబ్‍సైట్ https://www.epfindia.gov.in/site_en/index.php లోకి వెళ్లండి.
  • అనంతరం హోం పేజీలో సర్వీసెస్‍(Services) ట్యాబ్‍లో ఫర్ ఎంప్లాయీస్ (For Employees) అనే ఆప్షన్‍పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మెంబర్ పాస్‍బుక్ (Member Passbook) అని కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేస్తే ఓ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ యూఏఎన్ నంబర్ పాస్‍వర్డ్, అక్కడే ఉండే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తర్వాత మీరు మీ ఈపీఎఫ్ పాస్‍బుక్‍ను అక్కడ చూడవచ్చు. బ్యాలెన్స్, విత్‍డ్రాల్, నెలవారీ జమ సహా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
  • కావాలంటే ఈపీఎఫ్ పాస్‍బుక్‍ను డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.

EPFO Passbook: మీ పీఎఫ్ అకౌంట్‍కు రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మెసేజ్ రూపంలో మీరు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ ఏడాది జనవరిలోనూ కొద్ది రోజుల పాటు ఈపీఎఫ్‍వో వెబ్‍సైట్‍లో ఈ-పాస్‍బుక్ సర్వీస్ పని చేయలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాగే జరిగింది.

టాపిక్

తదుపరి వ్యాసం