తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali 2023: ఉద్యోగులకు దీపావళి శుభవార్త; ఈపీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు

Diwali 2023: ఉద్యోగులకు దీపావళి శుభవార్త; ఈపీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు

HT Telugu Desk HT Telugu

10 November 2023, 19:12 IST

  • PF interest: దీపావళి సందర్భంగా ఉద్యోగులకు శుభవార్త. ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. 2022 -23 సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలోకి డిపాజిట్ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PF interest: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలకు 8.15 శాతం వడ్డీ రేటు చొప్పున వడ్డీ మొత్తాన్ని జమజేసే ప్రక్రియను ప్రారంభించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో పీఎఫ్ ఖాతాలపై ఇదే అత్యధిక వడ్డీ రేటు కావడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 7.59 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ప్రతీ సంవత్సరం నిర్ణయం

ఈపీఎఫ్ఓ (EPFO) వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రతి సంవత్సరం నిర్ణయిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఈ ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం వార్షికంగా సర్దుబాటు చేస్తుంది. PF ఖాతా నెలవారీ ముగింపు బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని గణిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం తర్వాత వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.

ఆలస్యం అయ్యే అవకాశం

EPFO 2022-23 ఆర్థిక సంవత్సరానికి PF ఖాతాలకు వడ్డీని జమ చేయడంలో కొంత ఆలస్యం జరగవచ్చని ఈపీఎఫ్ఓ ఇప్పటికే సూచించింది. ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అన్ని ఖాతాల వడ్డీ చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి సమయం పడుతోందని వివరించింది. అయితే, ఇప్పటివరకు 24 కోట్లకు పైగా ఖాతాలకు విజయవంతంగా వడ్డీ జమ అయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.

How to check: యూఏఎన్ ను యాక్టివేట్ చేసుకోండి..

EPFO సభ్యులు EPFO పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వారి ఖాతాకు జమ అయిన వడ్డీని తెలుసుకోవచ్చు. లేదా, వారు EPFO కస్టమర్ కేర్ నంబర్‌ 1800-118-005 కు కాల్ చేయడం ద్వారా కూడా ఆ వివరాలను తెలుసుకోవచ్చు. తమ ఖాతాలకు వడ్డీ జమ అయందో, లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ సభ్యులు ముందుగా తమ యూఏఎన్ (Universal Account Number UAN) నంబర్ ను యాక్టివేట్ చేసుకోవాలి. అందుకు వారు ముందుగా..

  • ఈపీఎఫ్ఓ పోర్టల్ లోకి వెళ్లాలి.
  • “Activate UAN” లింక్ ను క్లిక్ చేయాలి.
  • మీ UAN నంబర్ ను ఇతర వివరాలను ఫిల్ చేయాలి.
  • అనంతరం “Activate UAN” బటన్ పై క్లిక్ చేయాలి.

PF interest credit: పీఎఫ్ బ్యాలెన్స్ ను ఇలా తెలుసుకోండి..

  • ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ను కానీ, లేదా ఉమంగ్ యాప్ ను కానీ ఓపెన్ చేయాలి.
  • యూఏఎన్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి.
  • “Member Passbook” సెక్షన్ లోకి వెళ్లాలి.
  • “View Passbook” పై క్లిక్ చేయాలి.
  • మీ పీఎఫ్ పాస్ బుక్, అందులో లావాదేవీలు కనిపిస్తాయి.

ఎస్ఎంఎస్ ద్వారా..

ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బాలన్స్ మొత్తాన్ని ఒక చిన్న ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. “EPFOHO UAN ENG” అనే ఆంగ్ల వ్యాక్యాన్ని మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా 7738299899 నంబర్ కు ఎస్ఎంఎస్ చేస్తే, ఈ పీఎఫ్ ఖాతాలో ఉన్న బాలెన్స్ తెలుస్తుంది. తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ENG అని ఉన్న చోట TEL అని టైప్ చేయండి.

తదుపరి వ్యాసం