తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Stocks: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్స్ ఇవే: డే ట్రేడర్స్ గైడ్

Day Trading Stocks: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 8 స్టాక్స్ ఇవే: డే ట్రేడర్స్ గైడ్

20 March 2023, 8:04 IST

    • Day Trading Guide: డే ట్రేడింగ్ చేసే వారు నేడు గమనించాల్సిన స్టాక్‍లను నిపుణులు సూచించారు. అలాగే నేడు మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది, నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఏవంటే..
స్టాక్స్​ టు బై లిస్ట్​
స్టాక్స్​ టు బై లిస్ట్​

స్టాక్స్​ టు బై లిస్ట్​

Day Trading Guide for 20 March: తీవ్ర ఒడిదొడుకులు ఎదురైనా శుక్రవారం సెషన్‍లో భారత స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాలను చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగి 57,989 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 17,100కు చేరింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 465 పాయింట్లు ఎగిసి 39,598 వద్ద స్థిరపడింది. మరి నేడు (మార్చి 20, సోమవారం) స్టాక్ మార్కెట్లు ఎలా మొదలయ్యే ఛాన్స్ ఉంది, నిఫ్టీకి ముఖ్యమైన లెవెల్స్ ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ప్రతికూలంగా..

Day Trading Guide for 20 March: ఎస్‍జీఎక్స్ నిఫ్టీని బట్టి చూస్తే భారత స్టాక్ మార్కెట్లు నేడు నెగెటివ్‍గానే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో ఉంది. ఆరంభంలో సూచీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. నేడు ఆసియా మార్కెట్లు నష్టాలతో ఓపెన్ అయ్యాయి.

Day Trading Guide for 20 March: నిఫ్టీ మరింత పడితే 16,950 వద్ద తక్షణ సపోర్ట్ ఉందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. “వీక్లీ చార్ట్‌పై నిఫ్టీకి లోవర్ షాడోతో లాంగ్ బేర్ క్యాండిల్‍‍ ఏర్పడింది. ఈ సీక్వెన్స్ లోవర్ బాటమ్ ప్రస్తుతం 16,850గా కనిపిస్తోంది. ఒకవేళ నిఫ్టీ ఇంకా పడితే 16,950 వద్ద తక్షణ సపోర్ట్ ఉంది. ఒకవేళ పెరిగితే 17300 - 17350 లెవెల్స్ వద్ద రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది” అని ఆయన విశ్లేషించారు.

Stocks to Trade Today: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్

  • ఐసీఐసీఐ బ్యాంక్: బై అట్ రూ.836, టార్గెట్: రూ.860, స్టాప్ లాస్: రూ.822
  • యూపీఎల్: బై అట్ రూ.715, టార్గెట్: రూ.737, స్టాప్ లాస్: రూ.703
  • పర్సిస్టెంట్ సిస్టమ్: బై అట్ రూ.4,651, టార్గెట్: రూ.4,800, స్టాప్ లాస్: రూ.4,580
  • లుపిన్: బై అట్ రూ.658, టార్గెట్: రూ.685, స్టాప్ లాస్: రూ.640
  • బ్రిటానియా: బై అట్ రూ.4,367, టార్గెట్: రూ.4,430, స్టాప్ లాస్: రూ.4,300
  • పిడిలైట్ ఇండియా: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.2,410, స్టాప్ లాస్: రూ.2,310
  • డాబర్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.551, స్టాప్ లాస్: రూ.527
  • బాటా: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.1,440 నుంచి రూ.1,450, స్టాప్ లాస్: రూ.1,400

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం