తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide For Today: ఈ రోజు ఈ స్టాక్స్ ట్రై చేయండి..

Day trading guide for today: ఈ రోజు ఈ స్టాక్స్ ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu

07 September 2023, 9:46 IST

    • Day trading guide for today: సిప్లా, సీమెన్స్, మారికో, టెక్స్ రెయిల్, టీఎన్పీఎల్, ఐటీసీ.. సంస్థల స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. సెప్టెంబర్ 7వ తేదీన సిప్లా, సీమెన్స్, మారికో, టెక్స్ రెయిల్, టీఎన్పీఎల్, ఐటీసీ.. సంస్థల స్టాక్స్ లాభాలను గడించే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

సెన్సెక్స్, నిఫ్టీ

బుధవారం స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను సాధించాయి. మూడు కీలక సూచీల్లో రెండు గ్రీన్ లో, ఒకటి రెడ్ లో ట్రేడింగ్ ను ముగించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ , బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ నష్టపోయింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 19,611 వద్ద, సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 65,880 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్లు నష్టపోయి, 44,409 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు కూడా మిశ్రమ ఫలితాలను సాధించాయి.

నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ సానుకూలత కొనసాగే అవకాశముందని, సమీప భవిష్యత్తులో నిఫ్టీ 19800 కి చేరుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లో రీసెర్చ్ అనలిస్ట్ గా చేస్తున్న నాగరాజ్ షెట్టి అంచనా వేస్తున్నారు. ఈ రోజు 12 కంపెనీల స్టాక్స్ కు ఎక్స్ డివిడెండ్ డే. జేటీఎల్ ఇండస్ట్రీస్ కు ఈ రోజు ఎక్స్ బోనస్ డే.

ఈ స్టాక్స్ తో లాభాలు..

మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, స్వస్తిక ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ లో సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ గా ఉన్న ప్రవేశ్ గౌర్, ఎల్ కేపీ సెక్యూరిటీస్ లో సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ గా ఉన్న రూపక్ దే అంచనాల ప్రకారం..సిప్లా, సీమెన్స్, మారికో, టెక్స్ రెయిల్, టీఎన్పీఎల్, ఐటీసీ.. సంస్థల స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

సిప్లా: ప్రస్తుత ధర రూ. 1256; టార్గెట్ ప్రైస్ రూ. 1298; స్టాప్ లాస్ రూ 1225

సీమెన్స్: ప్రస్తుత ధర రూ. 3945; టార్గెట్ ప్రైస్ రూ. 4020; స్టాప్ లాస్ రూ.3910

మారికో: ప్రస్తుత ధర రూ. 588; టార్గెట్ ప్రైస్ రూ. 616 ; స్టాప్ లాస్ రూ.574.

టెక్స్ రెయిల్: ప్రస్తుత ధర రూ. 153; టార్గెట్ ప్రైస్ రూ 165; స్టాప్ లాస్ రూ.145

టీఎన్పీఎల్: ప్రస్తుత ధర రూ. 284; టార్గెట్ ప్రైస్ రూ. 320; స్టాప్ లాస్ రూ.270

ఐటీసీ: ప్రస్తుత ధర రూ. 447; టార్గెట్ ప్రైస్ రూ. 460; స్టాప్ లాస్ రూ.441.

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం