Stocks to buy today : స్టాక్స్ టు బై లిస్ట్.. ఈ 6 షేర్లు కొంటే భారీ లాభాలు!
02 January 2023, 7:21 IST
- Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు 2022ను నష్టాలతో ముగించాయి. శుక్రవారం (డిసెంబర్ 30) ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ50.. 85 పాయింట్ల నష్టంతో 18,105 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్.. 293 పాయింట్లు కోల్పోయి 60,840 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్ల పతనంతో 42,986కు చేరింది. కాగా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ ఛార్ట్‌లో పెద్ద నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది కాస్త ప్రతికూల విషయం. ఇది రివర్సెల్కు సంకేతం.
Stock market new today : "నిఫ్టీకి ప్రస్తుతం 18,250 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అందుకే ఎక్కువ లాభాలు కనిపించడం లేదు. 18,250 లెవల్‌పైన సెటిల్ అయితే మార్కెట్ ఇంకా పెరగొచ్చు. 17,960 అని సపోర్ట్‌గా ఉంది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల నష్టంలో ఉండటమే ఇందుకు కారణం.
US Stock markets : ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.22శాతం, ఎస్ అండ్ పీ 500 0.25శాతం, నాస్డాక్ 0.11శాతం మేర నష్టాల్లో ముగిశాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2950.89కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2266.2కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై..
Stocks to buy : ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 150- రూ. 154
బజాజ్ ఫిన్సర్వ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1510, టార్గెట్ రూ. 1600- రూ. 1620
యూకో బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 26, టార్గెట్ రూ. 39
జీఎంఆర్ ఇన్ఫ్రా:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 34, టార్గెట్ రూ. 45
రిలయన్స్:- బై రూ. 2550, స్టాప్ లాస్ రూ. 2500, టార్గెట్ రూ. 2650
గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (జీఎస్ఎఫ్సీ):- బై రూ. 140, స్టాప్ లాస్ రూ. 132, టార్గెట్ రూ. 155
(గమనిక:- ఇవి నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)