తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Term Insurance : ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్​ అవుతుంది.. జాగ్రత్త!

Term insurance : ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్​ అవుతుంది.. జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

06 May 2023, 20:05 IST

    • Term insurance plan : మంచి టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ తీసుకుంటే సరిపోదు. అన్ని వివరాలు సరిగ్గా వెల్లడించాలి. లేకపోతే.. క్లెయిమ్​ రిజెక్ట్​ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ప్రశ్నించేందుకు మీరు కూడా ఉండరు! అందుకే.. టర్మ్​ ఇన్ష్యూరన్స్​ తీసుకునేటప్పుడు చేయకూడదని తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ రిజెక్ట్​ అవుతుంది..
ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ రిజెక్ట్​ అవుతుంది..

ఈ తప్పులు చేస్తే మీ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ రిజెక్ట్​ అవుతుంది..

Term insurance plan : జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. అప్పటివరకు సంతోషంగా ఉన్న జీవితం.. ఒక్కసారిగా తలకిందులు అయిపోవచ్చు. ఈ సమయంలో కుటుంబం గుర్తొస్తుంది. వారికి ఆర్థికంగా ఏదైనా చేసి ఉండేదని అనిపిస్తుంది. అందుకే మనకి 'టర్మ్​ ఇన్ష్యూరెన్స్​'లు ఉన్నాయి. ఈ టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ పాలసీతో మనం ప్రశాంతంగా జీవించవచ్చు. అయితే.. కొన్ని సందర్భాల్లో టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ క్లెయిమ్​ రిజెక్ట్​ అవుతుంది. అలా జరగకూడదంటే.. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వ్యాధుల గురించి చెప్పకపోవడం..

టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ ప్లాన్​ తీసుకుంటున్నప్పుడు.. మీరు పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. దేనిని దాచకూడదు. మీ ఆరోగ్యం, మీకు ఉన్న వ్యాధులు, లైఫ్​స్టైల్​ వంటివి కచ్చితంగా, సరిగ్గా చెప్పాలి. ప్రీమియం తగ్గుతుంది అనుకుని తప్పులు చెబితే.. భవిష్యత్తులో టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ రిజెక్ట్​ అవుతుంది. ప్రశ్నించేందుకు మీరు ఉండరు కూడా!

Term insurance rejections reasons : "ఇన్ష్యూరెన్స్​ తీసుకున్న కస్టమర్​.. తన ఆరోగ్య పరమైన వివరాలను సరిగ్గా ఇవ్వకపోత.. సంబంధిత వ్యక్తి బీమా పాలసీ రిజెక్ట్​ అవుతుంది. కస్టమర్​ ఇచ్చే వివరాలపై ఇషన్ష్యూరెన్స్​ పాలసీలు ఆధారపడి ఉంటాయి. ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నా చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే కస్టమర్​ తర్వాత కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది," అని కొటాక్​ మహీంద్రా లైఫ్​ ఇన్ష్యూరెన్స్​లోని చీఫ్​ రిస్క్​ ఆఫీసర్​ సునీల్​ శర్మ తెలిపారు.

ప్రిమియంలు సరిగ్గా కట్టకపోతే..

పాలసీ లాప్స్​ అయిపోతే ప్రయోజనం ఏం ఉండదు. కొన్నిసార్లు పాలసీ హోల్డర్లు ప్రీమియంలను సకాలంలో చెల్లించడం మర్చిపోతూ ఉంటారు. 30 రోజుల వరకు గ్రేస్​ పీరియడ్​ ఉంటుంది. అయినప్పటికీ ప్రీమియం కట్టకపోతే.. పాలసీ లాప్స్​ అయిపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు ప్రీమియంలను సకాలంలో కడుతూ ఉండాలి. పాలసీ లాప్స్​ అయిన ఒక్క రోజు తర్వాత క్లైయిమ్​ చేసినా.. అది రిజెక్ట్​ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ఇతర ఇన్ష్యూరెన్స్​ పాలసీల వివరాలు..

Term insurance plan benefits : టర్మ్​ ప్లాన్​ తీసుకుంటున్నప్పుడు.. మీ వద్ద అప్పటికే ఉన్న ఇన్ష్యూరెన్స్​ పాలసీల గురించి చెప్పాలి. ప్రస్తుతం, పాత పాలసీలను కూడా డిస్​క్లోజ్​ చేయాలి.

"మీ వద్ద అప్పటికే ఏమైనా పాలసీలు ఉంటే.. వాటి వివరాలు దాచకూడదు. అలా జరిగితే మీ టర్మ్​ ప్లాన్​ క్లెయిన్​ రిజెక్ట్​ అవుతుంది," అని పాలసీబజార్​.కామ్​ టర్మ్​ లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ హెడ్​ రిషభ్​ గర్గ్​ తెలిపారు.

లైఫ్​స్టైల్​ వివరాలు దాచకూడదు..

Term insurance plan best : మీకు సిగరెట్​, మద్యం, అనారోగ్యకరమైన తిండి అలవాట్లు ఉంటే.. వాటిని కచ్చితంగా చెప్పాలి. అంతేకాకుండా.. మీరు డీప్​ సీ డైవింగ్​, పారాగ్లైండింగ్​ వంటి వాటిపై ఆసక్తి ఉన్నా చెప్పాల్సిందే. ఈ వివరాలతో కంపెనీ.. మీ వ్యక్తిగత ప్లాన్​ను ఇవాల్యువేట్​ చేస్తుంది.

నామినీ వివరాలు ఇవ్వాల్సిందే..

నామినీ వివరాలు వెల్లడించడం ఎందులోనైనా అత్యంత కీలకం. మీ తదనాంతరం ప్లాన్​ సొమ్ము ఎవరికి దక్కాలి? అన్న విషయాన్ని చెప్పకోపోతే.. క్లైయిమ్​ సెటిల్​మెంట్​ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

"నామినీ వివరాలు లేకపోయినా క్లెయిన్​ రిజెక్ట్​ అవుతుంది. నామినీ వివరాలను పాలసీదారుడు కచ్చితంగా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో.. పాలసీ ఉందనే విషయమే నామినీకి తెలియదు. అంతా తెలిసిన తర్వాత.. క్లెయిమ్​ చేసుకోవడానికి వెళ్లేసరికి లేటు అయిపోతుంది," అని రెన్యూబై కో-ఫౌండర్​ ఇంద్రనీల్​ ఛట్టర్జీ అన్నారు.

మోసాలు..

Term insurance best : మరణించిన వారి పేరు మీదో లేక తీవ్ర అనారోగ్యం పాలైన వారి పేరు మీదో మరో వ్యక్తి టర్మ్​/ లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ పాలసీ తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మోసం చేయడానికి ఇలా చేస్తుంటారు. చెకింగ్​లో మోసం జరుగుతోందని తేలితే.. టర్మ్​ పాలసీ రిజెక్ట్​ అవుతుంది.

పైన చెప్పిన విధంగా.. వివరాలను సరిగ్గా ఇచ్చి, మీరు టర్మ్​ ఇన్ష్యూరెన్స్​ తీసుకోండి. ఫలితంగా క్లెయిమ్​ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్న నమ్మకం మీకు కలుగుతుంది.

తదుపరి వ్యాసం