తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Airlines Of 2023: ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ ఎయిర్ లైన్స్ ఏదో తెలుసా?.. టాప్ 20 లిస్ట్ ఇదిగో..

Best airlines of 2023: ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ ఎయిర్ లైన్స్ ఏదో తెలుసా?.. టాప్ 20 లిస్ట్ ఇదిగో..

HT Telugu Desk HT Telugu

21 June 2023, 16:54 IST

  • Best airlines: 2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన యాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Airlines) నిలిచింది. గత సంవత్సరం టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ (Qatar Airways) ఈ ఏడు రెండో స్థానంలోకి వెళ్లింది. ప్రయాణికుల సంతృప్తి, అందించే సేవలు ఆధారంగా టాప్ 20 లిస్ట్ ను రూపొందించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photographer: Nathan Laine/Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

Best airlines 2023: 2023లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్ లైన్స్ (Singapore Airlines) నిలిచింది. గత సంవత్సరం టాప్ ఎయిర్ లైన్స్ గా నిలిచిన ఖతార్ ఎయిర్ వేస్ (Qatar Airways) ఈ సంవత్సరం రెండో స్థానంలోకి వెళ్లింది. ప్రయాణికుల సంతృప్తి, అందించే సేవలు ఆధారంగా టాప్ 20 లిస్ట్ ను రూపొందించారు.

టాప్ ఫైవ్ లో ఉన్న ఎయిర్ లైన్స్

టాప్ 5 బెస్ట్ ఎయిర్ లైన్స్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్, ఖతార్ ఏయిర్ వేస్ తో పాటు మూడో స్థానంలో జపాన్ కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్, నాలుగో స్థానంలో ఎమిరేట్స్, ఐదవ ర్యాంక్ లో జపాన్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 లో ఈ ఎయిర్ లైన్స్ కు ఈ ర్యాంకింగ్స్ లభించాయి. అయితే, ఒవరాల్ గా రెండో స్థానంలోకి వచ్చినప్పటికీ.. బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో ఖతార్ ఎయిర్ వేస్ నే తొలి స్థానంలో కొనసాగుతోంది.

బడ్జెట్ ఎయిర్ లైన్స్ లో ది బెస్ట్ ఎయిర్ఆసియా

బడ్జెట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో చవకైన ఎయిర్ లైన్స్ గా ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. లో కాస్ట్ లాంగ్ హాల్ (low-cost long-haul) కేరియర్ గా స్కూట్ తొలి స్థానంలో నిలిచింది. బెస్ట్ క్యాబిన్ క్య్రూ కేటగిరీలో గరుడ ఇండోనేషియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఉత్తర అమెరికాలో తొలి ర్యాంక్ ను డెల్టా ఎయిర్ లైన్స్, అత్యంత పరిశుభ్రమైన ఎయిర్ లైన్స్ కేటగిరీలో తొలి ర్యాంక్ ను ఏఎన్ఏ సాధించాయి. సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి, మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి, ఈ లిస్ట్ ను రూపొందించారు.

ఇదే టాప్ 20 లిస్ట్

  1. సింగపూర్ ఎయిర్ లైన్స్
  2. ఖతార్ ఎయిర్ వేస్
  3. ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ)
  4. ఎమిరేట్స్
  5. జపాన్ ఎయిర్ లైన్స్
  6. టర్కిష్ ఎయిర్ లైన్స్
  7. ఎయిర్ ఫ్రాన్స్
  8. కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్
  9. ఇవా ఎయిర్
  10. కొరియన్ ఎయిర్
  11. హైనన్ ఎయిర్ లైన్స్
  12. స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్
  13. ఎతిహాద్ ఎయిర్ వేస్
  14. ఐబీరియా
  15. ఫిజి ఎయిర్ వేస్
  16. విస్తారా
  17. క్వాంటాస్ ఎయిర్ వేస్
  18. బ్రిటిష్ ఎయిర్ వేస్
  19. ఎయిర్ న్యూజీలాండ్
  20. డెల్టా ఎయిర్ లైన్స్

తదుపరి వ్యాసం