తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Share Price Target : రూ. 100 తాకిన జొమాటో షేరు ధర.. ఇప్పుడు బై? లేదా సెల్​?

Zomato share price target : రూ. 100 తాకిన జొమాటో షేరు ధర.. ఇప్పుడు బై? లేదా సెల్​?

Sharath Chitturi HT Telugu

07 August 2023, 15:21 IST

    • Zomato share price target : దాదాపు ఏడాదిన్న కాలం తర్వాత జొమాటో షేరు ధర రూ.100ని తాకింది. మరి ఈ స్టాక్​ని ఇప్పుడు బై చేయొచ్చా? లేక సెల్​ చేయాలా? టార్గెట్​ ప్రైజ్​ ఏంటి?
రూ. 100 తాకిన జొమాటో షేరు ధర.. ఇప్పుడు బై? లేదా సెల్​?
రూ. 100 తాకిన జొమాటో షేరు ధర.. ఇప్పుడు బై? లేదా సెల్​?

రూ. 100 తాకిన జొమాటో షేరు ధర.. ఇప్పుడు బై? లేదా సెల్​?

Zomato share price target : స్టాక్​ మార్కెట్​లో ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో హవా కొనసాగుతోంది. అదిరిపోయే క్యూ1 ఫలితాలతో ఈ సంస్థ షేర్లు గత రెండు రోజులుగా దూసుకెళుతున్నాయి. తాజాగా.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో జొమాటో స్టాక్​ ప్రైజ్​ రూ. 102ని తాకింది. ఈ స్టాక్​ రూ. 100 మార్క్​ను దాటడం.. 2022 జనవరి 25 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ షేర్లను ఈ ప్రైజ్​లో కొనొచ్చా? లేక ఉన్నవి అమ్మేయాలా? అని మదుపర్లలో సందేహాలు నెలకొన్నాయి. వాటిపై నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

అదరగొట్టిన త్రైమాసిక ఫలితాలు..

ఎఫ్​వై24 క్యూ1 ఫలితాల్లో జొమాటో అదరగొట్టింది. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఈ త్రైమాసికంలో నెట్​ ఫ్రాఫిట్​ను నమోదు చేసింది. నెట్​ ప్రాఫిట్​ను రూ. 2కోట్లుగా ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ లాస్​ రూ. 186కోట్లుగా ఉండేది. ఇక రెవెన్యూ విషయానికొస్తే జూన్​తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో ఆదాయం.. రూ. 2,416కోట్లకు చేరింది. గతేడాది ఇది రూ. 1,414 కోట్లుగా ఉంది.

Zomato Q1 results 2023 : ఎఫ్​వై23 రెండో సగంలో నెమ్మదించిన జొమాటో కోర్​ ఫుడ్​ బిజినెస్​.. ఈసారి బాగానే పుంజుకుంది. క్వార్టర్​ ఆన్​ క్వార్టర్​లో 11శాతం వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్​ అంచనాల కన్నా ఎక్కువే!

ఇప్పుడు బై? లేదా సెల్​?

జొమాటో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో స్టాక్​పై యుఫోరియా నెలకొందని, అందుకే గత రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో అమ్మకాల జోరు కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నాయి. అయితే.. ఈ స్థాయిలో స్టాక్​ పెరగడానికి వాల్యూయేషన్​ పరంగా మద్దతు లభించడం లేదని ప్రాఫిట్​మార్ట్​ సెక్యూరిటీస్​ రీసెర్చ్​ డైరక్టర్​ అవినాశ్​ గోరక్షకర్​ తెలిపారు.

Zomato share price target in Telugu : ఈ లెవల్స్​లో జొమాటో స్టాక్​పై ఆచితూచి వ్యవహరించాలని ఇండిట్రేడ్​ క్యాపిటల్​ గ్రూప్​ ఛైర్మన్​ సుదిప్​ అభిప్రాయపడ్డారు. సంస్థ సరైన మార్గంలోనే వెళుతోందని, కానీ ఆర్థిక వ్యవస్థ పరంగా మరింత మెరుగుపడాలని వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ నోమురా.. జొమాటో స్టాక్​ను డౌన్​గ్రేడ్​ చేసింది. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 60 అని వెల్లడించింది.

మరో ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ మోతీలాల్​ ఓస్లావ్​ మాత్రం.. జొమాటోకు బై రేటింగ్​ ఇచ్చింది. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ.110 అని తెలిపింది.

స్టాక్​ ప్రైజ్​ హిస్టరీ..

Zomato stock latest news : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో జొమాటో షేరు రూ. 102.85 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 98.8 వద్ద ట్రేడ్​ అయ్యింది. ఇక ఈ స్టాక్​ 5 రోజుల్లో దాదాపు 17శాతం పెరిగింది. నెల రోజుల్లో ఏకంగా 37శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆరు నెలల వ్యవధిలో కళ్లుచెదిరే రీతిలో దాదాపుగా 103శాతం లాభాలను ఇచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 65.4శాతం ప్రాఫిట్​ను నమోదు చేసింది.

తదుపరి వ్యాసం