తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Share Price: దూసుకెళ్తున్న జొమాటో షేర్ ధర; ఇప్పుడు ఐపీఓ ఇష్యూ ధరకు సమానం

Zomato share price: దూసుకెళ్తున్న జొమాటో షేర్ ధర; ఇప్పుడు ఐపీఓ ఇష్యూ ధరకు సమానం

HT Telugu Desk HT Telugu

08 June 2023, 15:27 IST

  • Zomato share price: దాదాపు గత రెండు నెలలుగా జొమాటో షేర్ విలువ పెరుగుతోంది. తాజాగా, ఈ ఫుడ్ ఏగ్రిగేటర్ కంపెనీ ధర 52 వారాల గరిష్టానికి చేరింది. అంతేకాదు, ఐపీఓ ఇష్యూ సమయంలో నిర్ణయించిన ధర అయిన రూ. 76 ని అందుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు గత రెండు నెలలుగా జొమాటో (Zomato) షేర్ విలువ పెరుగుతోంది. తాజాగా, ఈ ఆన్ లైన్ ఫుడ్ ఏగ్రిగేటర్ కంపెనీ ధర 52 వారాల గరిష్టానికి చేరింది. అంతేకాదు, ఐపీఓ ఇష్యూ సమయంలో నిర్ణయించిన ధర అయిన రూ. 76 ని అందుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Paytm UPI Lite: చిన్న చిన్న పేమెంట్స్ కోసం పేటీఎం యూపీఐ లైట్; పిన్ కూడా అవసరం లేదు..

Android users: ఆండ్రాయిడ్ యూజర్లకు సెర్ట్ అలర్ట్; స్మార్ట్ ఫోన్స్ కు హ్యాకింగ్ ముప్పు ఉందని హెచ్చరిక

Exchange torn currency notes: చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..

Kia EV6 facelift : కియా ఈవీ6 ఫేస్​లిఫ్ట్​.. మరింత స్టైలిష్​గా- మరింత పవర్​ఫుల్​గా!

Zomato share price: 52 వారాల గరిష్టం..

గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో జొమాటో షేర్ ధర బీఎస్ఈలో రూ. 74.80 వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూ ఇంట్రాడే హై, అలాగే, 52 వారాల గరిష్టం అయిన రూ. 76 కి చేరింది. ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీ నుంచి జొమాటో షేర్ల దూకుడు ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 48% వృద్ధి చెందింది. గత రెండేళ్లుగా జొమాటో షేర్ లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా, జొమాటో షేర్ సమీప భవిష్యత్తు టార్గెట్ ధరను రూ. 85 గా మోర్గాన్ స్టాన్లీ ప్రకటించింది.

Zomato Q4 results: లో మంచి రిజల్ట్స్

2022 -23 ఆర్థిక సంవత్సరం Q4 లో జొమాటో మంచి ఫలితాలను ప్రకటించింది. నష్టాలను గణనీయంగా తగ్గించుకుంది. అంచనాలను మించిన ఆదాయాన్ని అందుకుంది. Q3FY23 లో జొమాటో నష్టాలు రూ. 346.60 కోట్లు కాగా, Q4FY23 లో అవి దాదాపు సగం తగ్గి రూ. 188.20 కోట్లకు చేరాయి. అలాగే, సంస్థ ఆదాయం Q4FY22 లో రూ. 1,211.80 కోట్లు కాగా, Q4FY23 లో సంస్థ ఆదాయం రూ. 2,056 కోట్లకు పెరిగింది. దాంతో, ఇన్వెస్టర్లలో జొమాటో పై విశ్వాసం పెరిగింది. ఎట్టకేలకు మళ్లీ ఐపీఓ ఇష్యూ ధర అయిన రూ. 76 కి చేరుకుంది.

తదుపరి వ్యాసం