తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apple Users Alert: ఐ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు..

Apple users alert: ఐ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరికలు..

HT Telugu Desk HT Telugu

16 December 2023, 14:35 IST

google News
  • Apple users alert: అప్రమత్తంగా ఉండాలని ఐ ఫోన్ (Apple users) వినియోగదారులకు కేంద్రం ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ప్రొడక్ట్స్ లో కొన్ని సెక్యూరిటీ లోపాలున్నాయని వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Apple users alert: ఫోన్లలోని సెక్యూరిటీ లోపాలపై ఇప్పటికే సామ్సంగ్ ఫోన్ల వినియోగదారులను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెర్ట్ (Computer Emergency Response Team of India CERT).. తాజాగా, ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్ లోనూ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని వెల్లడించింది.

ఐఫోన్ సహా యాపిల్ ప్రొడక్ట్స్

ఈ లోపాలు ఐఫోన్ (iPhone) సహా యాపిల్ ప్రొడక్ట్స్ వినియోగదారులకు గణనీయమైన నష్టాలను కలిగిస్తాయి. ఇందులోని సెక్యూరిటీ లోపాల సహాయంతో హ్యాకర్లు ఈ ఫోన్లలోని సెన్సిటివ్ సమాచారాన్ని దొంగలించవచ్చు. ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవడానికి, రిమోట్ గా తమ కమాండ్స్ తో ఫోన్ ను ఆపరేట్ చేయడానికి వారికి అవకాశం లభిస్తుంది. తద్వారా, బ్యాంక్ సంబంధ లావాదేవీలు కూడా నిర్వహించి, ఐ ఫోన్ వినియోగదారులను లూటీ చేయవచ్చు. అందువల్ల వినియోగదారులు వెంటనే తమ ఫోన్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

ఈ యాపిల్ ప్రొడక్ట్స్ లో..

ఐఓఎస్ (iOS) 17.2 వర్షన్ కన్నా ముందు వర్షన్ సాఫ్ట్ వేర్ వాడుతున్న ఐ ఫోన్ (iPhone) లతో పాటు, ఐఓఎస్ (iOS), Apple watchOS iPadOS వాడుతున్న ప్రొడక్ట్స్ లో ఈ సెక్యూరిటీ సమస్య అధికంగా ఉందని సెర్ట్ వెల్లడించింది. ఈ ప్రొడక్ట్స్ లో సమస్య అత్యంత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. దీనివల్ల ఆథెంటికేషన్ లేకుండానే ఫోన్ ను యాక్సెస్ చేయగలగడం, ఫోన్ ను, అందులోని యాప్స్ ను రిమోట్ గా ఆపరేట్ చేయగలగడం, సున్నితమైన సమాచారాన్ని తస్కరించడం.. వంటి ప్రమాదాలు ఎదురవుతాయని పేర్కొంది.

సామ్సంగ్ ఫోన్స్ లో..

ఆండ్రాయిడ్ వెర్షన్ 11, 12, 13, 14 తో నడుస్తున్న సామ్సంగ్ (Samsung) మొబైల్ ఫోన్ వినియోగదారులకు కూడా కేంద్రం శుక్రవారం హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 14 వర్షన్ ఉన్న సామ్సంగ్ ప్రీమియర్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 23 లో సెక్యూరిటీ లోపాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అందువల్ల గెలాక్సీ ఎస్ 23 సహా సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వెంటనే తమ ఫోన్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

తదుపరి వ్యాసం