Samsung Galaxy S24 : సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
Samsung Galaxy S24 : సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఈ సిరీస్‌లో 3 గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఆ వివరాలు..
Samsung Galaxy S24 release date : స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సిరీస్.. 2024 జనవరి 17న అంతర్జాతీయంగా లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సామ్సంగ్ గెలాక్సీ ఎస్24..
ఈ సామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఎస్24, ఎస్24+, ఎస్24 అల్ట్రా గ్యాడ్జెట్స్ ఉంటాయి. జనవరి 17న ఇవి లాంచ్ అవుతుండగా.. ఒక రోజు తర్వాత, అంటే.. జనవరి 18న ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయి. జనవరి 26 తర్వాత.. ఈ గ్యాడ్జెట్స్ డెలివరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
Samsung Galaxy S24 ultra release date : ఇక సామ్సంగ్ గెలాక్సీ ఎస్224, ఎస్24+ లో ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీఓ డిస్ప్లే ఉండనుంది. 12జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్ వీటిల్లో ఉండొచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 లేదా ఎక్సినోస్ 2400 చిప్సెట్ వీటిల్లో కనిపించే అవకాశం ఉంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోనూ 50ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ సెకెండరీ, 10ఎంపీ రేర్ కెమెరా సెటప్ ఉంటుందట. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తుందని టాక్. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ6 సాఫ్ట్‌వేర్‌పై ఈ మోడల్స్ పనిచేస్తాయి.
Samsung Galaxy S24 ultra : ఇక సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో టిటానియమ్ ఫ్రేమ్ ఉండొచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ దీని సొంతం! 200ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఇందులో ఉంటుదట. సెల్ఫీ కోసం 12ఎంపీ కెమెరా మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
సామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర ఎంత ఉండొచ్చు..?
2024 జనవరి 17న.. అమెరికా కాలిఫోర్నియా వేదికగా జరగనున్న ఓ ఈవెంట్లో ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ లాంచ్కానుంది. ఈ వేరియంట్స్ ధరలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కాకపోతే.. వీటి ధరలు రూ. 75000, రూ. 83500, రూ. 1.1లక్షలకు అటు ఇటుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సామ్సంగ్ కొత్త మిడ్- రేంజ్ స్మార్ట్‌ఫోన్…
Samsung Galaxy S24 price in India : సరికొత్త మిడ్- రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని సామ్సంగ్ సంస్థ సిద్ధం చేస్తోందని సమాచారం. దీని పేరు గెలాక్సీ ఏ25. ఇదొక 5జీ గ్యాడ్జెట్. ఈ మోడల్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
రూమర్స్, లీక్స్ ప్రకారం.. సామ్సంగ్ గెలాక్సీ ఏ25లో ఎక్సినోస్ 1280 చిప్సెట్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ గ్యాడ్జెట్లో 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం