iPhone 14 Plus discount: ఇంత తక్కువ ధరకు ఐ ఫోన్ 14 ప్లస్ మరెక్కడా దొరకదు.. డోంట్ మిస్-huge price drop on iphone 14 plus get other bank and exchange offers too ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 14 Plus Discount: ఇంత తక్కువ ధరకు ఐ ఫోన్ 14 ప్లస్ మరెక్కడా దొరకదు.. డోంట్ మిస్

iPhone 14 Plus discount: ఇంత తక్కువ ధరకు ఐ ఫోన్ 14 ప్లస్ మరెక్కడా దొరకదు.. డోంట్ మిస్

HT Telugu Desk HT Telugu
Nov 15, 2023 01:16 PM IST

iPhone 14 Plus discount: ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చిన తరువాత, ఐ ఫోన్ 14 సిరీస్, ఐ ఫోన్ 13 సిరీస్, ఐ ఫోన్ 12 సిరీస్ ఫోన్లు వివిధ ఈ కామర్స్ సైట్స్ లో తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. తాజాగా, ఐ ఫోన్ 14 ప్లస్ ఇప్పుడు చాలా చవకగా లభిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Tech)

iPhone 14 Plus discount: ఐఫోన్ కొనాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారా? మీ ప్రణాళికను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. పండుగ సీజన్ ముగిసింది కానీ కొన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికీ Apple iPhoneలపై భారీగానే తగ్గింపులను అందిస్తున్నాయి. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్‌పై అద్బుతమైన డీల్‌ను అందిస్తోంది. ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ను గణనీయమైన డిస్కౌంట్ లో ఇప్పుడు సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్..

ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధరను తగ్గించింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 63999 లకే లభిస్తుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ప్రైస్ ఇప్పుడు రూ. 79900 గా ఉంది. అంటే, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 14 ప్లస్ 19 శాతం డిస్కౌంట్ లో లభిస్తుంది. అంతేకాదు, అదనంగా, ఆకర్షణీయమైన బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

బ్యాంక్ డిస్కౌంట్

ఈ 19% డిస్కౌంట్ కాకుండా, అదనంగా iPhone 14 ప్లస్‌ కొనుగోలులో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను SBI క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే, అదనంగా 10 శాతం అదనంగా 10% డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే, ఇందులో కనీస చెల్లింపు మొత్తం రూ. 5 వేలు ఉండాలి. గరిష్టంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌

ఈ ఐఫోన్ 14 ప్లస్ ధరను మరింత తగ్గించడానికి, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ని కూడా ఎంచుకోవచ్చు. మీ వద్ద వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఏదైనా స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసి, గరిష్టంగా రూ. 42000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, ఎక్స్చేంజ్ లో మీకు లభించే డిస్కౌంట్ మీరు ఎక్క్సేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ లపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రాంతంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉందో? లేదో? ఫ్లిప్ కార్ట్ లో మీ ప్రాంత PIN కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్

ఈ ఐఫోన్ 14 ప్లస్ మోడల్ లో 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంటుంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 12 MP ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. iPhone 14 Plusలో 15 W వరకు MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5 W వరకు Qi వైర్‌లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది 20 W అడాప్టర్‌ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

Whats_app_banner