తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Apollo Hospitals Results: అపోలో హాస్పిటల్స్ నికర లాభాల్లో 50 శాతం వృద్ధి; 180 శాతం డివిడెండ్

Apollo Hospitals results: అపోలో హాస్పిటల్స్ నికర లాభాల్లో 50 శాతం వృద్ధి; 180 శాతం డివిడెండ్

HT Telugu Desk HT Telugu

30 May 2023, 17:06 IST

    • భారత్ లోని ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q4లో అపోలో హాస్పిటల్స్ రూ. 146 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లోని ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q4లో అపోలో హాస్పిటల్స్ రూ. 146 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 (Q4FY22)లో అపోలో హాస్పిటల్స్ ఆర్జించిన రూ. 97 కోట్లతో పోలిస్తే, Q4FY23 లో సంస్థ లాభాలు 50% పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

Apollo Hospitals net income: రూ. 4 వేల కోట్ల ఆదాయం

Q4FY23లో అపోలో హాస్పిటల్స్ నికర ఆదాయం రూ. 4318.50 కోట్లు. ఇది Q4FY22 లో సంపాదించిన నికర ఆదాయం కన్నా 21% అధికం. Q4FY22 లో అపోలో హాస్పిటల్స్ రూ. 3577.15 కోట్ల నికర ఆదాయం సముపార్జించింది. మే 30, మంగళవారం అపోలో హాస్పిటల్స్ షేర్ విలువ బీఎస్ఈలో 92% తగ్గి, రూ. 4603.25 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ టైమ్ ముగిసేటప్పటికి అపోలో హాస్పిటల్ షేర్ విలువ రూ. 4646.10 గా ఉంది. 2022 డిసెంబర్ 5వ తేదీన అపోలో హాస్పిటల్ షేర్ విలువ రూ. 4,900.00 కి చేరి, 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. అలాగే, 2022 జూన్ 7వ తేదీన రూ. 3,528.20 కి తగ్గి 52 వారాల కనిష్టానికి చేరింది.

Apollo Hospitals dividend: 180% డివిడెండ్..

Q4FY23 ఫలితాలతో పాటు సంస్థ మదుపర్లకు అపోలో హాస్పిటల్స్ 180% డివిడెండ్ ను కూడా ప్రకటించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 9 లను డివిడెండ్ గా అందించాలని సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ డేట్ గా ఆగస్ట్ 19వ తేదీని ని నిర్ణయించారు. అలాగే, ఈ డివిడెండ్ మొత్తం షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లోకి సెప్టెంబర్ 9వ తేదీలోగా జమ అవుతాయి.

తదుపరి వ్యాసం