తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Shares: వరుసగా రెండో రోజూ ఆదానీ షేర్ల హవా..

Adani shares: వరుసగా రెండో రోజూ ఆదానీ షేర్ల హవా..

HT Telugu Desk HT Telugu

02 March 2023, 22:32 IST

  • Adani shares: వరుసగా రెండో రోజు కూడా ఆదానీ షేర్లు లాభాల దిశగా సాగాయి.  గురువారం ఆదానీ గ్రూప్ లోని మొత్తం 10 కంపెనీల షేర్ల విలువ పెరగడం విశేషం.

అహ్మదాబాద్ లోని ఆదానీ సంస్థల ప్రధాన కార్యాలయం
అహ్మదాబాద్ లోని ఆదానీ సంస్థల ప్రధాన కార్యాలయం (Bloomberg)

అహ్మదాబాద్ లోని ఆదానీ సంస్థల ప్రధాన కార్యాలయం

Adani shares: స్టాక్ మార్కెట్లో ఆదానీ గ్రూప్ (Adani Group) హవా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా ఆదానీ షేర్లు లాభాల బాటన సాగాయి. బుధవారం ఆదానీ గ్రూప్ (Adani Group) లోని 8 సంస్థలు రాణించగా, గురువారం మొత్తం 10 సంస్థల షేర్లు సానుకూల ఫలితాలను సాధించాయి.

Adani shares: 10 కంపెనీల షేర్లు..

ఆదానీ గ్రూప్ (Adani Group) లో ఆదానీ ట్రాన్స్ మిషన్ షేర్లు (Adani Transmission) 5%, ఆదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు (Adani Green Energy) 4.99%, ఆదానీ విల్మర్ షేర్లు (Adani Wilmar) 4.99% వృద్ధి చెందాయి. అలాగే, ఆదానీ పవర్ (Adani Power) షేర్లు 4.98% పెరిగాయి. ఎన్డీటీవీ (NDTV) షేర్లు 4.96%, అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) షేర్లు 4.94%, ఆదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) షేర్లు 4.41% పెరిగాయి. ఆదానీ గ్రూప్ లోని కీలకసంస్థ ఆదానీ పోర్ట్స్ (Adani Ports) షేర్ల విలువ 3.50%, ఆదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) షేర్ విలువ 2.69% పెరిగింది. సిమెంట్ కంపెనీ ఏసీసీ షేర్ వాల్యూ కూడా 1.5% పెరిగింది.

Adani shares: మార్కెట్ విలువ..

ఆదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లకు తాజాగా పెరిగిన విలువతో ఆదానీ గ్రూప్ మార్కెట్ విలువ గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 7.86 లక్షల కోట్లకు పెరిగింది. గత రెండు ట్రేడింగ్ సెషన్స్ లో ఆదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 74,302 కోట్లు పెరిగింది. ఆదానీ గ్రూప్ (Adani Group) ఆర్థిక అవకతవకలపై జనవరి 24న యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ (Hindenberg) నివేదిక బహిర్గతమైన నాటి నుంచి ఆదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమవుతూ వస్తున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం