తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Enterprises Q4 Results: అంచనాలను మించిన ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లాభాలు

Adani Enterprises Q4 results: అంచనాలను మించిన ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లాభాలు

HT Telugu Desk HT Telugu

04 May 2023, 17:00 IST

    • Adani Enterprises Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) గురువారం ప్రకటించింది.  ఈ Q4 లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ నికర లాభాల్లో 137% వృద్ధి నమోదైంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

Adani Enterprises Q4 results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) గురువారం ప్రకటించింది. ఈ Q4 లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ నికర లాభాల్లో 137% వృద్ధి నమోదైంది. హిండెన్ బర్గ్ నివేదిక (Hindenburg) వెలుగుచూడడంతో ఒక్కసారిగా ఆదానీ (Adani) సామ్రాజ్యం కుప్పకూలిన పరిస్థితి నెలకొన్నది. కానీ అనూహ్యంగా, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆదానీ గ్రూప్ (Adani Group) సంస్థలు అత్యంత వేగంగా కోలుకుని మళ్లీ లాభాల బాట పట్టాయి.

Adani Enterprises results: రూ. 722 కోట్ల నికర లాభాలు..

ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) Q4FY23 లో రూ. 722.48 కోట్ల నికర లాభాలను (net profit) ఆర్జించింది. ఇది ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) Q4FY22 లో ఆర్జించిన రూ. 304.34 కోట్ల కన్నా 137.4% అధికం. అలాగే, ఈ Q4 లో రూ. 2,472.94 కోట్ల పన్ను అనంతరం లాభాలను (PAT) సంస్థ సాధించింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) ఈపీఎస్ Q4FY22 లో రూ. 2.77 గా ఉండగా, Q4FY23లో అది రూ. 6.34 కి చేరింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) ఆపరేషన్స్ ఆదాయం ఈ Q4 లో రూ. 31,346.05 కోట్లుగా ఉంది. Q4FY22 లో సంస్థ ఆపరేషన్స్ ఆదాయం రూ. 24,865.52 కోట్లు. అంటే, Q4FY22 కన్నా Q4FY23 లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) ఆదాయం 26% పెరిగింది. మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరం (FY23) లో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ (Adani Enterprises) ఆదాయం రూ. 136,977.76 కోట్లుగా ఉంది. FY22 లో సంస్థ మొత్తం ఆదాయం రూ. 69,420.18 గా ఉంది.

Adani Enterprises dividend: రూ. 1.20 డివిడెండ్

ఆదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) Q4 ఫలితాలతో పాటు డివిడెండ్ ను ప్రకటించింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 1.20 డివిడెండ్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రికార్డు డేట్ గా జులై 7, 2023 అని తెలిపింది. ఏజీఎం సమావేశంలో ఆమోదం పొందిన అనంతరం డివిడెండ్ మొత్తాన్ని జులై 21 లోగా షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది.

తదుపరి వ్యాసం