తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ftx Collapse : 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మిస్సింగ్​! అసలేం జరిగింది?

FTX collapse : 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మిస్సింగ్​! అసలేం జరిగింది?

12 November 2022, 11:56 IST

    • FTX collapse : దివాళా తీసిన ఎఫ్​టీఎక్స్​ క్రిప్టో ఎక్స్​ఛేంజ్​లో 1 బిలియన్​ డాలర్ల కనస్టమర్ల నిధులు కనిపించడం లేదని సమాచారం. దీనిపై సంస్థ, సీఈఓ స్పందించలేదు.
ఎఫ్​టీఎక్స్​లో.. 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మిస్సింగ్​! అసలేం జరిగింది?
ఎఫ్​టీఎక్స్​లో.. 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మిస్సింగ్​! అసలేం జరిగింది? (REUTERS)

ఎఫ్​టీఎక్స్​లో.. 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మిస్సింగ్​! అసలేం జరిగింది?

1 billion dollar client funds missing in FTX : క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసిన ఎఫ్​టీఎక్స్​ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తాజాగా.. ఎఫ్​​టీఎక్స్​ క్రిప్టో ఎక్స్​ఛేంజ్​ నుంచి 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులు మాయమైపోయినట్టు తెలుస్తోంది. ఇవి లెక్కల్లో కనిపించడం లేదని.. ఈ విషయంతో సంబంధం ఉన్న కొందరు అంతర్జాతీయ మీడియాకు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

ఎఫ్​టీఎక్స్​ ఎక్స్​ఛేంజ్​ వ్యవస్థాపకుడు సామ్​ బాంక్​మన్​- ఫ్రైడ్​.. ఎక్స్​ఛేంజ్​కు సంబంధించిన 10బిలియన్​ డాలర్ల కస్టమర్ల నిధులను, తన సొంత ట్రేడింగ్​ కంపెనీ అయిన అలమేడా రీసెర్చ్​కు రహస్యంగా బదిలీ చేసినట్టు.. గతంలో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి.. కనీసం 1 బిలియన్​ డాలర్ల కస్టమర్ల నగదు మిస్సింగ్​ అని తాజాగా తేలింది. మొత్తం మీద 1.7బిలియన్​ డాలర్ల నిధులు కనిపించడం లేదని కొందరు చెబుతుంటే.. 1-2 బిలియన్​ డాలర్లు మిస్సింగ్​ అని మరికొందరు అంటున్నారు.

ఆర్థికంగా కుదేలు..

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రిప్టో ఎక్స్​ఛేంజ్​ ప్లాట్​ఫామ్​గా గుర్తింపు పొందిన ఎఫ్​టీఎక్స్​.. దివాళా తీసే స్థితికి చేరింది. సంస్థలో అనేక ఆర్థికపరమైన లోపాలు ఉన్నట్టు గత వారం వార్తలు బయటకొచ్చాయి.

FTX CEO Bankman fried : కష్టాల్లో ఉన్న ఎఫ్​టీఎక్స్​ను ఆదుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ప్లాట్​ఫామ్​ బినాన్స్​ ముందుకొచ్చింది. కానీ సంస్థ ఆర్థిక వ్యవస్థలో అనేక లోపాలు ఉండటం చూసి వెనకడుగు వేసింది. చేసేదేమీ లేక.. దివాళాకు అప్లై చేసుకుంది ఎఫ్​టీఎక్స్​. కస్టమర్లు.. నిధులను విత్​డ్రా చేసుకోకుండా ఆంక్షలు విధించింది.

అయితే.. 10 బిలియన్​ డాలర్ల నగదును ఎఫ్​​టీఎక్స్​ నుంచి రహస్యంగా తన సంస్థకు మార్చుకోలేదని బాంక్​మన్​ ఫ్రెడ్​ చెబుతున్నారు. ఈ వార్తలను ఖండించారు. కానీ కనిపించకుండా పోయిన కస్టమర్ల నిధులపై మాత్రం బాంక్​మన్​ ఫ్రెడ్​, ఎఫ్​టీఎక్స్​, అలమేడా ఇంకా స్పందించలేదు.

సంస్థ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉన్నట్టు అందులోని చాలా మంది సీనియర్​ అధికారులకు కూడా తెలియదు! గత ఆదివారం.. ఎఫ్​టీఎక్స్​తో ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు బినాన్స్​ ప్రకటించడంతో పరిస్థితుల మరింత తీవ్రంగా మారాయి. అప్పుడే.. ఎఫ్​టీఎక్స్​ సీనియర్​ అధికారులతో బాంక్​మన్​ ఫ్రైడ్​ సమావేశమైనట్టు, అందులో కొన్ని విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది. సంస్థను మళ్లీ గాడిన పడేసేందుకు బయట నుంచి ఎంత నిధులు తీసుకురావాలి? అన్న విషయంపైనా చర్చలు జరిగినట్టు సమాచారం. కానీ ఇవేవీ వర్కవుట్​ అవ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

FTX collapse latest news : మిస్సింగ్​లో ఉన్న 1-2 బిలియన్​ డాలర్లు అలమేడా ఆస్తుల వివరాల్లో కూడా లేవని, బ్యాలెన్స్​ షీట్​లలో కూడా కనిపించడం లేదని సమాచారం. ఈ వ్యవహారంపై వేళ్లన్నీ బాంక్​మన్​ ఫ్రైడ్​వైపే వెళుతున్నాయి. సంస్థ ఆర్థిక పరిస్థితులను దాచి పెట్టేందుకు.. అక్రమ మార్గం ద్వారా కొందరికి ఆయన భారీ మొత్తంలో నగదు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆ నగదు రికార్డుల్లో లేదని తెలుస్తోంది. అయితే.. ఈ ఆరోపణలను బాంక్​మన్​ ఫ్రైడ్​ ఖండించారు.

తదుపరి వ్యాసం