తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Atmakur Bypoll : ఆత్మకూరు ఉపఎన్నిక…. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు

Atmakur Bypoll : ఆత్మకూరు ఉపఎన్నిక…. మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు

HT Telugu Desk HT Telugu

26 June 2022, 11:38 IST

    • నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరుగుతున్నఉపఎన్నికలో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపొందారు.  తొలి రౌండ్‌ నుంచి మేకపాటి ఆధిక్యాన్ని ప్రదర్శించిన మేకపాటి భారీ ఆధిక్యంతో గెలిచారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ తరపున ఆయన సోదరుడు గౌతమ్‌ రెడ్డి పోటీ చేశారు. 
ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఖాయమైంది
ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఖాయమైంది

ఆత్మకూరులో మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఖాయమైంది

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపొందారు.దాదాపు 85వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విక్రమ్ రెడ్డి గెలిచారు. ఆత్మకూరు నియోజక వర్గంలో 2.13లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో దాదాపు లక్షా 37వేల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP EAPCET 24: నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2024… విద్యార్థులకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

17వ రౌండ్‌ ముగిసే సమయానికి మేకపాటి ‌విక్రమ్‌ రెడ్డికి 75వేల పైచిలుకు మెజారిటీ లభించింది. వైసీపీ అభ్యర్ధికి 87,775 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి భరత్‌కుమార్‌ 15,888ఓట్లకు పరిమితం అయ్యారు. బిఎస్పీ అభ్యర్ధికి 4,371 ఓట్లు వచ్చాయి. నోటాకు 3,567 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్ధి గెలుపు ఖాయమైంది. వైసీపీ అభ్యర్ధి లక్షా ఓట్ల మెజార్టీ లభిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. 20 రౌండ్ ముగిసే సమయానికి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి భారీ ఆధిక్యం లభించింది. మొదటి రౌండ్‌ నుంచి మేకపాటి ఆధిక్యం కొనసాగింది. ఆత్మకూరు ఉపఎన్నికల్లో నోటాకు కూడా గణనీయంగా ఓట్లు లభించాయి.

దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు ఈ నెల 23న పోలింగ్‌ నిర్వహించారు. మూడు లోక్‌సభ స్థానాలతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీతో పాటు యూపీలోని రాంపూర్‌, అజంఘడ్‌, పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఢిల్లీలోని రాజేంద్రనగర్‌, ఝార్ఖండ్‌లోని మందర్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు.

ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రం అభ్యర్ధిని పోటీకి దింపింది. బీజేపీ ఒంటరిగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీజేపీ మిత్రపక్షం జనసేన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండిపోయింది. మొత్తం 20వ రౌండ్‌లలో ఓట్ల లెక్కింపు జరిగింది. చివరి రౌండ్‌లో వైసీపీ అభ్యర్ధికి 3697 ఓట్లు లభిస్తే బీజేపీ అభ్యర్ధికి 1116 ఓట్లు, బిఎస్సీ అభ్యర్ధికి 124, నోటాకు 207 ఓట్లు లభించాయి. 20రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 82742ఓట్లు లభించగా పోస్టల్‌ ఓట్లతో కలిపి 82,888ఓట్లు లభించాయి.

టాపిక్

తదుపరి వ్యాసం