తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pcc Chief : ఏపీ పీసీసీ చీఫ్​గా వైఎస్ షర్మిల...! అధికారిక ప్రకటనే మిగిలిందా..?

AP PCC Chief : ఏపీ పీసీసీ చీఫ్​గా వైఎస్ షర్మిల...! అధికారిక ప్రకటనే మిగిలిందా..?

16 January 2024, 6:10 IST

    • Andhra Pradesh PCC President: ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించనుంది కాంగ్రెస్. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి గిడుగు రుద్రరాజు తప్పుకున్న నేపథ్యంలో… ఈ పదవిని షర్మిలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో) (Sharmila Twitter)

కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల(ఫైల్ ఫొటో)

Andhra Pradesh PCC President : ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ వేదికగా రాజకీయపార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల... కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఢిల్లీ వేదికగా ఆమె హస్తం కండువా కప్పేసుకున్నారు. ప్రస్తుతానికి షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించని కాంగ్రెస్ హైకమాండ్... కీలకమైన పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రకటన ఇవాళో, రేపో రావొచ్చని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

గిడుగు రాజీనామా...

ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు సోమవారం తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు. రాజీనామాకు సంబంధించి ఎలాంటి కారణాలు కూడా చెప్పలేదు. అమలాపురం పట్టణానికి చెందిన గిడుగు రుద్రరాజు... 2022 నవంబరులో ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా... 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. గతంలో ఒడిశా రాష్ట్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

షర్మిలకు లైన్ క్లియర్...!

ఎలాంటి కారణాలు లేకుండా గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన నేపథ్యంలో... వైఎస్ షర్మిల కోసమే అన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న షర్మిల.. ఇకపై ఆంధ్రా రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల పేరుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇవాళో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రసుత్తం కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే పలువురు ప్రముఖలకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన షర్మిల… ఆహ్వాన పత్రికను ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల… కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రస్తుతానికి మాత్రం పార్టీ కార్యకర్తను మాత్రమే అని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని, అందుకోసం నిబద్ధతతో పని చేస్తానని పునరుద్ఘాటించారు.

షర్మిలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తే... ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పాయి. ఇక షర్మిల సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ గానే బరిలో ఉంటామని చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టైంలో.... పలువురు పార్టీలు మారిపోయారు. అంతేకాదు చాలా మంది నేతలు కూడా ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది. ఇరు పార్టీల్లో అసంతృప్త నేతలు ఉన్నారు. నిజంగా షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే.... వైఎస్ఆర్ ను అభిమానించే నేతలతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

షర్మిల ప్రస్థానంలోని పలు విషయాలు:

- ప్రస్తుతం 49 ఏళ్ల వైఎస్ షర్మిల.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి అవుతారు.

- 2009లో విమాన ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు చనిపోయారు. వారికి సంఘీభావం తెలిపేందుకు ఆయన సోదరుడు జగన్మోహన్ రెడ్డి యాత్రను ప్రారంభించారు. అయితే దీనికి కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

-షర్మిల కూడా 2020 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భాగంగానే పని చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు... పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు.

-2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల... తన సోదరుడు వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు.

-ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ వచ్చారు. అంతేకాకుండా... తెలంగాణ వేదికగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. కొత్త పార్టీ పెట్టిన ఏడాది తర్వాత ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తన కుమారుడి పార్టీ అయిన వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి షర్మిల పార్టీకి మద్దతు ప్రకటించారు.

- తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు వైఎస్ షర్మిల. కానీ తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి పోటీ నుంచి విరమించుకున్నారు.

-జనవరి 4వ తేదీన వైఎస్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు వైఎస్ షర్మిల. ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- షర్మిల మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అనిల్ కుమార్ హిందువు. కానీ వైఎస్ఆర్ కుటుంబం క్రిస్టియన్ కావడంతో 1995లో షర్మిలను వివాహం చేసుకున్న తర్వాత క్రైస్తవ మతంలోకి మారారు బ్రదర్ అనిల్. 1998లో అనిల్ కుమార్ మత ప్రచారకుడిగా మారారు.

-షర్మిల- బ్రదర్ అనిల్‌ దంపతులకు రాజా రెడ్డి, అంజలి రెడ్డి పిల్లలు ఉన్నారు.

- ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజా రెడ్డి వివాహం జరగనుంది. ప్రియా చట్నీస్ ఫుడ్ చైన్ యజమాని అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ఈమె. వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరి అమెరికాలో మాస్టర్స్ చదువుతున్న సమయంలో కలిశారు.

తదుపరి వ్యాసం