తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Police Medals : ఏపీ, తెలంగాణలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్స్ లైన్స్ మెడల్స్

AP TS Police Medals : ఏపీ, తెలంగాణలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్స్ లైన్స్ మెడల్స్

12 August 2023, 11:34 IST

    • AP TS Police Medals : కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్రహోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 140 మంది పోలీస్ సిబ్బందిని ఎంపిక చేయగా, ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
ఏపీ, తెలంగాణ పోలీసులకు మెడల్స్
ఏపీ, తెలంగాణ పోలీసులకు మెడల్స్

ఏపీ, తెలంగాణ పోలీసులకు మెడల్స్

AP TS Police Medals : ఆగస్టు 15 సందర్భంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్ అందించడం ఆనవాయితీ. 2023 సంవత్సరానికి గానూ “సెంట్రల్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” కింద 140 మంది పోలీసు సిబ్బందికి పతకాలు అందించనుంది కేంద్రప్రభుత్వం. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు ప్రతీఏటా కేంద్ర హోంమంత్రి పేరిట పతకాలు అందిస్తారు. ఈ ప్రతిభాపురస్కారాలను 2018లో ప్రారంభించారు. నేర పరిశోధనలో ఉన్నతమైన, వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, దర్యాప్తులో ప్రతిభ చూపిన వారికి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న పతకాలు ప్రకటిస్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 140 మంది పోలీసులకు ఈ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది అవార్డులు అందుకోనున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్‌ఐఎ నుంచి 12 మంది, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 18 మంది, తమిళనాడు నుంచి 08, మధ్యప్రదేశ్ నుంచి 7, గుజరాత్ నుంచి ఆరుగురు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 ఎంపిక అయ్యారు. మొత్తం సిబ్బందిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన పోలీస్ సిబ్బంది

  • అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్
  • మన్సురుద్దీన్ షేక్, సర్కిల్ ఇన్స్పెక్టర్
  • ధనుంజయుడు మల్లెల, Dy.SP
  • సుప్రజ కొర్లకుంట, Addl. SP
  • రవిచంద్ర ఉప్పుటూరి, DSP

తెలంగాణ నుంచి ఎంపికైన పోలీస్ సిబ్బంది

  • మేకల తిరుపతన్న, Addl. SP
  • రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ
  • మూల జితేందర్ రెడ్డి, Asst. CP
  • కమ్మాయిపల్లె మల్లికార్జున కిరణ్‌కుమార్, Dy.SP
  • భూపతి శ్రీనివాసరావు, Asst. CP

తదుపరి వ్యాసం