తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 12న బ్రేక్ దర్శనాల రద్దు

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 12న బ్రేక్ దర్శనాల రద్దు

10 November 2023, 18:49 IST

    • TTD Latest News : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. దీపావళి అస్థానం సందర్భంగా నవంబరు 12న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Deepavali Asthanam Tirumala : ఈ నెల12వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 11వ తేదీన బ్రేక్ దర్శనానికి సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు - శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం జరిపారు. అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం చేశారు.

ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం

ఈ సందర్భంగా ఈవో ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం ధ్వజారోహణం తో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థం కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు.

ఈ సందర్భంగా చెన్నై కు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డి ఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి ఆరు గొడుగులను కానుకగా అందించారు. ఇదిలా ఉండగా రాత్రి 7నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.

తదుపరి వ్యాసం