తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rk Roja : జగనన్న ముద్దు రోజమ్మ వద్దంటున్న నగరి వైసీపీ నేతలు, ఓ రేంజ్ లో ఫైర్ అయిన మంత్రి రోజా!

RK Roja : జగనన్న ముద్దు రోజమ్మ వద్దంటున్న నగరి వైసీపీ నేతలు, ఓ రేంజ్ లో ఫైర్ అయిన మంత్రి రోజా!

12 March 2024, 15:01 IST

    • RK Roja : మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ నగరి నియోజకవర్గం వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వ్యవహారంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టైం వచ్చినప్పుడు వీళ్లందరికీ బుద్ధి చెబుతానన్నారు.
మంత్రి రోజా
మంత్రి రోజా

మంత్రి రోజా

RK Roja : మంత్రి ఆర్కే రోజా(Minister RK Roja)... నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే. ఈసారి కూడా నగరి నుంచే పోటీ చేస్తానని అంటున్నారు రోజా. అయితే గతంతో కంటే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. మంత్రి రోజాపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. ఈసారి రోజాకు టికెట్ ఇస్తే తమ పార్టీ కోసం పనిచేయమంటున్నారు. దీంతో నగరి వైసీపీ వర్గ విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై మంత్రి రోజా స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రతిరోజు రూ. 500 కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అసమ్మతి నేతలపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లు వైసీపీలో ఉంటే తనకు నగరిలో 500 మెజార్టీ వస్తుందని, వీళ్లు బయటకు పోతే 30-40 వేల వరకు మెజార్టీతో గెలుస్తానన్నారు. మీరు మాట్లాడినట్టు తన వాళ్లు మాట్లాడితే తట్టుకోగలరా? అంటూ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

నగరిలో వెన్నుపోటు దారులతో పోరాటం

వైసీపీ (Ysrcp)పార్టీ క్యాడర్ ను రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. వీళ్లందరికీ బుద్ధి చెప్పే టైం వచ్చిందన్నారు. ప్రతిపక్షాలతో పోరాడుతున్న సీఎం జగన్ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నారన్నారు. ఇదే తరహాలో నగరి నియోజకవర్గం(Nagari Constituency)లో వెన్నుపోటు దారులతో పోరాటం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని అందిస్తున్నానన్నారు. తన హయాంలో నగరి నియోజకవర్గా్న్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. విపక్షాలు కూటమి కట్టి వస్తున్నా సీఎం జగన్(CM Jagan) ఒంటరిగా పోరాడుతున్నారన్నారు. ఇదే విధంగా నగరిలో తాను ఒంటరిగా పోరాడుతూ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Electoins 2024)నగరిలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని రోజా ధీమావ్యక్తం చేశారు. తన ఓటమే లక్ష్యంగా కొంతమంది వీరితో మాట్లాడిస్తున్నారన్నారు. నగరిలో ప్రతిపక్షాలతో పాటు వైసీపీలోని కొందరు తల్లిపాటు తాగి రొమ్ము గుద్దుతున్నారన్నారు. వారందరికీ త్వరలోనే బుద్ధి చెబుతానన్నారు.

జగనన్న ముద్దు రోజమ్మ వద్దు

'జగనన్న ముద్దు రోజమ్మ వద్దు' అంటూ తిరుపతి ప్రెస్ క్లబ్‌(Tirupati Press club)లో రోజూ 500 కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. నగరిలో మాట్లాడే ధైర్యం లేక తిరుపతిలో కూర్చుని తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. సోమవారం నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మంత్రి రోజాకు వ్యతిరేకంగా తిరుపతిలో విలేకర్ల సమావేశం పెట్టారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకు టికెట్ (RK Roja Ticket)ఇవ్వవద్దని సీఎం జగన్ ను విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రోజాకి పార్టీ టికెట్ ఇస్తే మాత్రం ఓడించి తీరుతామన్నారు. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ హవాలోనూ రోజాకు కేవలం రెండు వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చిందన్నారు. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆమెకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. నగరిలో రోజా సోదరుల అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపించారు.

తదుపరి వ్యాసం