తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sdsc Shar Jobs : శ్రీహరికోట స్పేస్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

SDSC SHAR Jobs : శ్రీహరికోట స్పేస్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

B.S.Chandra HT Telugu

07 August 2022, 12:02 IST

    • తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉపాధ్యాయ నియామకాలకు సంబందించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ విడుదల చేసింది.
శ్రీహరికోటలో ఉపాధ్యాాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్
శ్రీహరికోటలో ఉపాధ్యాాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీహరికోటలో ఉపాధ్యాాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్

శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్రం అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసింది. ఉపాధ్యాయ శిక్షణలో అర్హత పొందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌, ప్రైమరీ టీచర్‌ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

పోస్టు గ్రాడ్యుయేట్ మ్యాథ్స్‌ టీచర్లుగా రెండు పోస్టులు భర్తీ చేస్తారు. వీటిలో ఒకటి అన్‌ రిజర్వ్‌డ్,మరొకటి ఓబీసీలతో భర్తీ చేస్తారు.ఫిజిక్స్‌లో ఒక అన్‌ రిజర్వ్‌డ్ పోస్టు, బయాలజీలో ఒక ఎస్సీ అభ్యర్ధితో పోస్టు, కెమిస్ట్రీలో అన్‌ రిజర్వ్‌డ్ పోస్టుఒకటి, గ్రాడ్యుయేట్‌ మ్యాథ్స్‌ టీచర్లలో రెండు, హిందీ టీచర్లలో రెండు పోస్టులు, ఇంగ్లీషులో ఒకటి, కెమిస్ట్రీలో ఒకటి, బయాలజీలో ఒకటి, పిఇటి ఒకటి, పిఇటి ఫిమేల్ ఒకటి, ప్రైమరీ టీచర్లుగా ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టులకు అయా క్యాటగిరీల వారీగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎమ్మెస్సీ బిఇడి, బిఎస్సీ బిఇడి అర్హతలు ఉన్న వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హత పొందుతారు.పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్‌ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 40ఏళ్ల వరకు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ టీచర్‌ పోస్టులకు 18-35ఏళ్ల వారు, ప్రైమరీ టీచర్‌ పోస్టులకు 30ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగష్టు ఆరు నుంచి 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ వెబ్‌ సైట్ https://www.shar.gov.in లేదా https://apps.shar.gov.in లో లభిస్తాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రతి కోర్సు అర్హతలు ఎన్‌సిఈఆర్‌టి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ ఉద్యోగాలకు అర్హత డిగ్రీలలో కనీసం 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం