తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Leaders Polavaram Visit : టీడీపీ నేతల పోలవరం పర్యటనలో ఉద్రిక్తత, మార్గమధ్యలోనే అరెస్టులు!

TDP Leaders Polavaram Visit : టీడీపీ నేతల పోలవరం పర్యటనలో ఉద్రిక్తత, మార్గమధ్యలోనే అరెస్టులు!

10 June 2023, 15:15 IST

    • TDP Leaders Polavaram Visit : టీడీపీ నేతల పోలవరం విజిట్ ఉద్రిక్తంగా మారింది. మార్గమధ్యలో టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతలు
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతలు

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు టీడీపీ నేతలు

TDP Leaders Polavaram Visit : టీడీపీ నేతల పోలవరం ప్రాజెక్టు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకొనే వాహనాల్లోకి ఎక్కించారు. అయితే పోలీసులను దాటుకొన్న దేవినేని ఉమ ద్విచక్రవాహనంపై పోలవరం బయలుదేరారు. పోలవరం గ్రామంలో దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేతలను గోపాలపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేతలు పోలవరం పర్యటనతో పోలీసులు భారీగా మోహరించారు.

వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత భయం

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు మార్గమధ్యలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం టీడీపీ నేతలు నేతలు దేవినేని ఉమ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి, మద్దిపాటి వెంకటరాజు, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలువురు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు బయలుదేరారు. అయితే గోపాలపురం మండలం కొవ్వూరుపాడు శివారులో టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి మోటార్ సైకిల్‌పై పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులు దేవినేని ఉమను అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నాశనం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వైఫల్యాలు బయటపడతాయనే తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మంది ప్రజలు ప్రాజెక్టును సందర్శించారని గుర్తుచేశారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామంటే వైసీపీ సర్కార్ ఎందుకు భయపడుతుందని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

పోలీసులు కళ్లుగప్పి పోలవరానికి దేవినేని ఉమ

అయితే మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసులు కళ్లుగప్పి పోలవరం గ్రామానికి చేరుకున్నారు. బైక్ పై వస్తున్న దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం వెళ్తున్న దేవినేని వాహనాన్ని ముందుగా ప్రగడపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకొని బైక్ పై కాలువ గట్టు మీదగా పోలవరం వద్దకు దేవినేని ఉమ చేరుకున్నారు. పోలవరం ప్రధాన ద్వారం వద్ద దేవినేని ఉమను గుర్తించిన పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

తదుపరి వ్యాసం