తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Iiit Students Issue: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్ధుల ఆందోళన..బకాయిల కోసం కాలేజీల ఒత్తిడి

IIIT Students Issue: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్ధుల ఆందోళన..బకాయిల కోసం కాలేజీల ఒత్తిడి

HT Telugu Desk HT Telugu

05 May 2023, 11:49 IST

    • IIIT Students Issue: ఏపీలో ట్రిపుల్ విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. కోర్సులు పూర్తైనా కాలేజీ యాజమాన్యం  సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ విద్యార్ధులు ఆందోళనకు దిగారు.  కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు అందకపోవడంతోనే సర్టిఫికెట్లు ఆపేసినట్లు కాలేజీలు చెబుతున్నాయి. 
నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్
నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్

నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్

IIIT Students Issue: ఏపీలో ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయల్లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో చదువుతున్న విద్యార్ధులు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లను నిలిపివేశాయి.

ట్రెండింగ్ వార్తలు

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్దులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన నిడుదలను విద్యార్దులను విడుదల చేసినా చాలామంది కాలేజీలకు ఫీజులు చెల్లించలేదని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ నిర్వాహకులు చెబుతున్నాయి.

వివిధ ప్రాంతాల్లో ఉన్న క్యాంపస్‌లలో మెస్‌లను కూడా ఆపేయడంతో విద్యార్దులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెల 26వ తేదీన మలి విడత జగనన్న వసతి దీవెన నిధుల్ని ముఖ్యమంత్రి అనంతపురంలో విడుదల చేశారు. ఐటీ నుంచి ఇంజినీరింగ్ వరకు వేర్వేరు కోర్సులు చదువుతున్న వారికి గరిష్టంగా రూ.20వేల వరకు స్కాలర్ షిప్‌ రూపంలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25,17,245మంది విద్యార్ధులకు రూ.912.71 కోట్లను విడుదల చేశారు. ఇంజనీరింగ్ చదివే వారికి ఏటా రూ.20వేల రుపాయలు స్కాలర్‌షిప్‌గా ప్రభుత్వం చెల్లిస్తోంది.

మరోవైపు ప్రొఫెషనల్ కోర్సు ఫీజుల్ని జగనన్న విద్యా దీవెన రూపంలో తల్లుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. గతంలో విద్యార్ధుల ఫీజుల్ని కాలేజీలకు నేరుగా రీయింబర్స్‌ చేసేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీల్లో జవాబుదారీతనం పెంచే పేరుతో ఫీజుల్ని తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా విద్యార్ధులు తమకు ఫీజులు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నామని కాలేజీ ‍యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు బకాయిలు భారీగా ఉండటంతోనే ఫీజుల వసూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ యాజమాన్యాలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం