తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Steel Plant : కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

Kadapa Steel Plant : కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

HT Telugu Desk HT Telugu

12 December 2022, 14:32 IST

    • Kadapa Steel Plant రాయలసీమ ప్రాంత ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న కడప స్టీల్ ప్లాంట్‌‌తో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.  కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు మొత్తం రూ.23,985కోట్ల రుపాయల పెట్టుబడులకు  అమోదం లభించింది. 
స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో సిఎం జగన్
స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో సిఎం జగన్

స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో సిఎం జగన్

Kadapa Steel Plant ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్టీల్ ప్లాంట్‌ సహా మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలంయలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశమైంది. కడప జిల్లాలో రూ. 8,800 కోట్లతో జేఎస్‌ డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోద ముద్ర వేసింది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎస్‌ఐబిపిలో ఆమోదం తెలిపారు. మొత్తం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు విడతల్లో మొత్తం రూ. 8,800 కోట్ల పెట్టుబడులు పెడతారు. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెడతారు. మొదటి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్‌ ఉత్పత్తులు తయారు చేస్తారు. మొత్తం ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. వెనకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని సిఎం జగన్ చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జేఎస్‌ డబ్ల్యూ గ్రూప్ మొత్తం 22 బిలియన్ డాలర్ల కంపెనీ అని, ప్రపంచ వ్యాప్తంగా స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ రంగాల్లో కంపెనీ ప్లాంటులు ఉన్నాయన్నారు. ఏడాదికి 27 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను సాధిస్తున్న కంపెనీ కడపలో కూడా ప్లాంట్‌ నిర్మాణాన్ని చేపడుతోందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీగఢ్, ఒడిశాల్లో జేఎస్‌ డబ్ల్యూ కి కర్మాగారాలు ఉన్నాయని త్వరలోనే ఏపీలో కూడా ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు.

పవర్‌ ప్లాంట్ల నిర్మాణం…..

కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఎస్‌ఐబిపిలో అమోద ముద్ర వేశారు. 1600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 4వేలమందికి ఉపాధి లభిస్తుందని సిఎం చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తారు.

2024 డిసెంబర్లో ప్రారంభించి… నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తారు. రూ. 8,855 కోట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుకు కూడా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 2100 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద 900 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారీగా ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 2100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

తదుపరి వ్యాసం