తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sbi Specialist Officers: ఎస్‌బిఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్ ఉద్యోగాలు...అనుభవమే అర్హత.. ఇంటర్యూతో సెలక్షన్..

SBI Specialist Officers: ఎస్‌బిఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్ ఉద్యోగాలు...అనుభవమే అర్హత.. ఇంటర్యూతో సెలక్షన్..

Sarath chandra.B HT Telugu

22 February 2024, 13:39 IST

    • SBI Specialist Officers: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అనుభవమే అర్హతగా Interviewతో ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
ఎస్‌బిఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఎస్‌బిఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎస్‌బిఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

SBI Specialist Officers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సాధారణ ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు భిన్నంగా ఎంపిక ఉంటుంది. అయా రంగాల్లో విద్యార్హతలతో పాటు అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా 80 స్పెషలిస్ట్‌ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సెక్యూరిటీ అనలిస్ట్, ఏజిఎం అప్లికేషన్ సెక్యూరిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు 23, డిప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్ట్‌లు 51, మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ పోస్టులు 3, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అప్లికేషన్ సెక్యూరిటీ పోస్టులు 3 ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అయా పోస్టుకు తగిన విద్యార్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగాల్లో బిఇ, బిటెక్‌, ఎంఈ, ఎంటెక్, ఎంసిఏ, ఎమ్మెల్సీ విద్యార్హతలు కలిగి ఉండాలి.

అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో విద్యార్హతలతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి...

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 30ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 35ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 38ఏళ్లు, ఏజీఎం పోస్టుకు 42 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు.ఎంపికైన అభ్యర్థులు నవీ ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.

వేతన చెల్లింపు

అసిస్టెంట్ మేనేజర్‌ క్యాడర్‌లో ఉద్యోగాలకు రూ.36,000 - రూ.63,840 , డిప్యూటీ మేనేజర్‌కు రూ.48,170-69,810, మేనేజర్ పోస్టుకు రూ.63,840-78,230, ఏజిఎం పోస్టుకు రూ.89,890- 1,00,350 వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం...

దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు https://www.sbi.co.in/ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. ఎంపిక విధానం, ఇతర సమాచారం కోసం పూర్తి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం