తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rrb Special Trains : రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

RRB Special Trains : రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

10 June 2022, 14:10 IST

    • రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్ష కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లు పరీక్షలు నిర్వహించే నగరాల మీదుగా ప్రయాణిస్తాయి. ఆర్‌ఆర్‌బి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ రైళ్లలో ప్రయాణింవచ్చు.
ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ పరీక్షల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది
ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ పరీక్షల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది

ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ పరీక్షల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది

ట్రైన్‌ నంబర్ 8401/8402 భద్రక్‌-గుంటూరు-భద్రక్‌ రైలు భద్రక్‌లో జూన్‌ 13న రాత్రి 9గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం ఒకటిన్నరకు గుంటూరు చేరుతుంది. గుంటూరులో 15వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి మర్నాడు మధ్నాహ్నం ఒకటిన్నరకు భద్రక్‌ చేరుతుంది. ఈ రైలు జైపూర్‌ కె రోడ్డు, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దా రోడ్డు, బ్రహ్మపురా, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, విశాఖపట్టణం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ మీదుగా గుంటూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్లలో ఆగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

ట్రైన్‌ నంబర్‌ 07571/07576 నల్గొండ-కడప-నల్గొండ ప్రత్యేక రైలు జూన్‌ 10 రాత్రి తొమ్మిది గంటలకు నల్గొండలో బయలుదేరుతుంది. మర్నాడు ఉదయం 8.10కు కడప చేరుతుంది. 13న కడపలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం 4.45కు నల్గొండ చేరుతుంది. నల్గొండ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్‌, కంభం, గిద్దలూరు, నంధ్యాల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా కడప చేరుతుంది.

ట్రైన్‌ నంబర్ 07582/07585 కడప-బెంగుళూరు-కడప ప్రత్యేక రైలు జూన్‌ 11న ఉదయం 9 గంటలకు కడపలో బయలుదేరి సాయంత్రం ఐదున్నరకు బెంగుళూరు చేరుతుంది. 12వ తేదీ రాత్రి 7.15కు బెంగుళూరులో బయలుదేరి మర్నాడు ఉదయం 5గంటలకు కడప చేరుకుంటుంది. ఈ రైలు రాజంపేట, కోడూరు, రేణిగుంట, కట్పాడి, జాలార్‌పేట మీదుగా బెంగుళూరు చేరుతుంది.

ట్రైన్‌ నంబర్‌ 07586/07591 కాజీపేట-లాతూర్‌- కాజీపేట ప్రత్యేక రైలు జూన్‌ 11 ఉదయం 5.10కు కాజీపేటలో బయలుదేరి రాత్రి 8కు లాతూర్ చేరుతుంది. 12 సాయంత్రం ఆరున్నరకు లాతూర్‌లో బయలుదేరి మర్నాడు 12గంటలకు కాజీపేట చేరుతుంది. ఈ రైలు సికింద్రబాద్‌, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్‌, తాండూర్‌, సెరం, వాడీ, కలబురుగి, సోలాపూర్,, కురువాడిలలో ఆగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం