తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancellation : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- రేపట్నుంచి జన్మభూమి, రాయగడ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు

Trains Cancellation : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- రేపట్నుంచి జన్మభూమి, రాయగడ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు

02 September 2023, 16:23 IST

    • Trains Cancellation : తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.
రైళ్లు రద్దు
రైళ్లు రద్దు

రైళ్లు రద్దు

Trains Cancellation : ఏపీ, తెలంగాణ మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అనకాపల్లి-తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ పనుల కారణంగా ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌( రైలు నెం.12805), విజయవాడ-విశాఖ మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం.12717), విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ (రైలు నెం.17219), గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెం.17243) ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-తిరుపతి మధ్య నడిచే (రైలు నెం.22708) డబుల్‌ డెక్కర్‌ రైలును విశాఖ-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారి టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయని, డబ్బులు రిఫండ్‌ చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

రద్దైన రైళ్లు- తేదీలు

  • విశాఖపట్నం-లింగంపల్లి(12805) - సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు
  • లింగంపల్లి-విశాఖపట్నం(12806) -సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు
  • గుంటూరు-రాయగడ(17243) -సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు
  • రాయగడ-గుంటూరు(17244) -సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు
  • విజయవాడ-విశాఖపట్నం(12718)-సెప్టెంబర్ 3 నుంచి 10 వరకు
  • విశాఖపట్నం-విజయవాడ(12717)- సెప్టెంబర్ 3 నుంచి 10 వరకు
  • మచిలీపట్నం-విశాఖపట్నం(17219)-సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు
  • విశాఖపట్నం-మచిలీపట్నం(17220)-సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు

పాక్షికంగా రద్దైన రైళ్లు

  • తిరుపతి-విశాఖపట్నం(22708)- సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు- సామర్లకోట, విశాఖ మధ్య పాక్షికంగా రద్దు
  • విశాఖపట్నం-తిరుపతి(22707)- సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు- విశాఖ, సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు

స్పెషల్ ట్రైన్స్

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - రామంతాపురం(ట్రైన్ నెంబర్ - 07695) మధ్య నడిచే ప్రత్యేక రైలును పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. సెప్టెంబర్ 06వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ సేవలను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఇక రామంతాపురం నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (నెంబర్ 07696)ను పొడిగించారు అధికారులు. ఈ ట్రైన్ సెప్టెంబర్ 08 నుంచి 29 తేదీ వరకు నడుస్తుంది. ప్రతి శుక్రవారం ఈ స్పెషల్ ట్రైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇటీవలే 16 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ(రైలు నెంబర్ 07637) మధ్య ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అంతేకాకుండా సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతి మధ్య నడిచే 07638 ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు. కాజీపేట్ నుంచి దాదర్ మధ్య ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది. దాదర్ నుంచి కాజీపేట్ మధ్య ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 28 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

తదుపరి వ్యాసం