తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Imd Alerts: మండుతున్న ఎండలు, వడగాలులతో జనం విలవిల

IMD Alerts: మండుతున్న ఎండలు, వడగాలులతో జనం విలవిల

HT Telugu Desk HT Telugu

12 April 2023, 11:31 IST

    • IMD Alerts: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో గత మూడ్రోజులుగా వాతావరణం మారిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు  వడగాలులు తోడయ్యాయి.  మరికొన్ని రోజులు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీ తెలంగాణలో మండుతున్న ఎండలు
ఏపీ తెలంగాణలో మండుతున్న ఎండలు

ఏపీ తెలంగాణలో మండుతున్న ఎండలు

IMD Alerts: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఐఎండి అంచనాల ప్రకారం ఏపీలో నేడు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని గుర్తించారు. మరో 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని హెచ్చరించింది. వడగాల్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఏపీలోని అల్లూరి జిల్లా కూనవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం, మండలాల్లో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపుతాయని ఎస్‌డిఎంఏ ప్రకటించింది. దీంతో పాటు అల్లూరి జిల్లాలో 9, అనకాపల్లి 14, తూర్పు గోదావరి 16,ఏలూరులో 5, గుంటూరులో 6, కాకినాడలో 12, కోనసీమ 1, కృష్ణాలో 6, ఎన్టీఆర్‌లో 14, పల్నాడులో 1, మన్యం 11, శ్రీకాకుళంలో 7, విశాఖలో 3, విజయనగరంలో 18, వైయస్సార్ జిల్లాలోని 3 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

మంగళవారం అనకాపల్లిలోని 5మండలాలు, కాకినాడలో 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అల్లూరిలో 3, అనకాపల్లి 7,ఏలూరు 4, కాకినాడ 3, కృష్ణా 2, ఎన్టీఆర్, పల్నాడు, విశాఖ, విజయనగరం లో ఒక్కొక్క మండలంలో వడగాల్పులు నమోదయ్యాయి.

తెలంగాణలో భానుడి భగభగ….

అటు తెలంగాణలో కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణకేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోకి కింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.

రానున్న మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఉదయం 11 నుంచి 3 గంటల వరకు ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మరో రెండు రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

దస్తూరాబాద్‌ (నిర్మల్‌) 42.8, కొల్లాపూర్‌ (నాగర్‌ కర్నూల్‌) 42.7, కట్టంగూర్‌ (నల్లగొండ) 42.6, ఆదిలాబాద్‌ అర్బన్‌ 42.6, నేలకొండపల్లె (ఖమ్మం) 42.5, లక్కవరం రోడ్డు (సూర్యాపేట) 42.4, అలంపూర్‌ (జోగులాంబ గద్వాల) 42.4, వడ్డెమాన్‌ (మహబూబ్‌నగర్‌) 42.2, మల్లాపూర్‌ (జగిత్యాల) 42.2, తలమడుగులో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

వేసవి ఉష్ణోగ్రతల కారణంగా నిర్మల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు 42 డిగ్రీలను దాటేశాయి. ఇంకో రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా టెంపరేచర్లు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రెండు రోజులు 43 డిగ్రీలకుపైనే టెంపరేచర్​ నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లోనూ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదయ్యే ​ ఉందని అధికారులు తెలిపారు.

తదుపరి వ్యాసం