తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala | మోటార్లకు మీటర్ల బిగింపు సరైందే.. అది తప్పేంటి?

sajjala | మోటార్లకు మీటర్ల బిగింపు సరైందే.. అది తప్పేంటి?

HT Telugu Desk HT Telugu

12 May 2022, 19:55 IST

    • వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వెనుక డొంక తిరుగుడు వ్యవహారం ఏదీ లేదని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతులకు శాశ్వతంగా లబ్ధి, విద్యుత్‌ శాఖ, సిబ్బందికి జవాబుదారీతనం ఉండేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి
సజ్జల రామకృష్ణా రెడ్డి

సజ్జల రామకృష్ణా రెడ్డి

రాష్ట్రంలో అర్హత ఉన్నా.. సాయం పొందలేని కౌలు రైతులంటూ ఎవరూ లేరని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు వెనక డొంక తిరుగుడు వ్యవహారం ఏదీ లేదని తెలిపారు. రైతులకు శాశ్వతంగా లబ్ధి, విద్యుత్‌ శాఖ, సిబ్బందికి జవాబుదారీతీనం ఉండే విషయం చూసుకొని.. మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు. 'వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే తప్పేంటి. మీటర్ల ఏర్పాటు వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. మీటర్ల ఏర్పాటుపై రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారు.' అని సజ్జల విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత లేని కొంతమంది టీడీపీ కార్యకర్తలు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి జరుగుతుంటే కడుపు మంట తట్టుకోలేక అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలెవరూ అసంతృప్తిగా లేరు. టీడీపీ శ్రేణులే ఇదంతా చేస్తున్నారు. మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూడాలంటే ఓడిపోయిన టీడీపీ నేతలు, అభ్యర్థులను గడప గడపకు కార్యక్రమానికి పంపాలి. ధైర్యం ఉంటే జరుగుతున్న వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలి.

                                                               - సజ్జల రామకృష్ణారెడ్డి

టాపిక్

తదుపరి వ్యాసం