తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayasaireddy: తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించాలన్న సాయిరెడ్డి

VijayasaiReddy: తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించాలన్న సాయిరెడ్డి

Sarath chandra.B HT Telugu

09 January 2024, 13:15 IST

    • VijayasaiReddy: త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 
వైఎస్సార్సీపీ  ఎంపీ సాయిరెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీ సాయిరెడ్డి

వైఎస్సార్సీపీ ఎంపీ సాయిరెడ్డి

VijayasaiReddy: ఏపీ, తెలంగాణల్లో ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ సాయిరెడ్డి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు విజయవాడలో విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

ఆరుఅంశాలపై సీఈసీకి వైసీపీ తరపున ఫిర్యాదు చేసినట్టు సాయిరెడ్డి చెప్పారు. ఈసీతో భేటీకి గుర్తింపు లేని అన్‌ రికగ్నైజ్డ్‌ జనసేన పార్టీని ఎందుకు అనుమతించారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. అలయన్స్‌ పార్టీగా అనుమతించాలన్న టీడీపీ కోరినట్టు ఈసీ అధికారులు తెలిపారన్నారు.

జనసేన పార్టీ ఇప్పటి వరకు బీజేపీ అలయన్స్‌‌గా ఉందని, నిన్న ఈసీకి ఇచ్చిన వినతిలో టీడీపీతో అలయన్స్‌ పార్టనర్‌గా పేర్కొన్నారని సాయిరెడ్డి చెప్పారు. జనసేన బీజేపీ అలయన్స్‌ పార్టనర్‌ లేదా టీడీపీ అలయన్స్‌ పార్టీనా అనేది స్పష్టం చేయాలన్నారు.

జనసేన గుర్తింపు లేని పార్టీ అని, గ్లాస్‌ గుర్తు సాధారణ చిహ్నమని, కామన్‌ సింబల్‌ను కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన పార్టీకి కేటాయించడాన్ని తాము తప్పు పట్టినట్టు చెప్పారు.

మరోవైపు ఏపీలో దాదాపు పదిలక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని సీఈఓ ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సీఈఓ బల్క్‌ కంప్లైంట్‌ను అనుమతించడాన్ని తప్పు పట్టినట్టు సాయిరెడ్డి వివరించారు.

ఒక వ్యక్తికి బోగస్‌ ఓట్లు ఉన్నాయనే సంగతి ఎలా తెలుస్తుందని సాయిరెడ్డి ప్రశ్నించారు. 175 నియోజక వర్గాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. 26జిల్లాల కలెక్టర్లకు పంపిన ఫిర్యాదును ఈర్వోలు విచారించి, బోగస్ ఓట్ల వ్యవహారంపై నివేదిక ఇచ్చారని, 26జిల్లాల్లో ఫిర్యాదులపై నివేదికల్లో బోగస్‌ ఓట్లు లేవని కలెక్టర్లు తేల్చారని చెప్పారు.

విశాఖలో 38,872 బోగస్‌ ఓట్లలో 26,123ఓట్లు నిజమైనవేనని తేలిందన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తోందని, అలాంటి ఫిర్యాదులు చేస్తున్న వారిపై మీద చర్యలు తీసుకోవాలన్నారు. బల్క్ ఫిర్యాదులు మీద చర్యలు తీసుకోకుండా సీఈఓను ఆదేశించాలని కోరినట్టు సాయిరెడ్డి చెప్పారు.

డిసెంబర్ 14, 2023న చేసిన ఫిర్యాదులో టీడీపీ అక్రమ పద్ధతుల్లో ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తోందని ఫిర్యాదు చేశామని తెలిపారు, దేశంలో ఏ రాజకీయ పార్టీ కులం, మతం, రాజకీయ ఆసక్తి ఆధారంగా ప్రొఫైలింగ్ చేసే అధికారం లేదని, టీడీపీ మాత్రం లండన్‌ నుంచి ఆ పనులు చేస్తోందన్నారు.

టీడీపీ మ్యానిఫెస్టో పేరుతో ఆన్‌లైన్‌ బాండ్‌ల పేరుతో ప్రలోభ పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణలో ఓటర్లు నమోదు చేసుకున్న డూప్లికేట్ ఓటర్లు ఆంధ్రాలో కూడా నమోదై ఉన్నారన్నారు. డూప్లికేట్ ఓట్లను ఖచ్చితంగా తొలగించాలని కోరారు. తెలంగాణలో ఓట్ల నమోదు కోసం బూత్‌లను తెరిచి ఓట్లను చేర్పిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు తొలగించిన తర్వాతే ఏపీలో ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బహిరంగ సభల్లో అసభ్యకరంగా మాట్లాడుతున్న నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు.

ఏపీ తెలంగాణల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు. డూప్లికేట్ ఓటర్ల సమస్య ఉన్నందున రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. అధికారుల మీద చర్యలు తీసుకోడానికి, తప్పులు చేయడానికి కారణం ఎవరన్నది ఎన్నికల సంఘం నిర్ధారించాలన్నారు. ఎన్నికల విధుల్లో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని సాయిరెడ్డి చెప్పారు.

తదుపరి వ్యాసం