తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sai Reddy Stuck In Lift: స్మృతివనం లిఫ్ట్‌లో చిక్కుకున్న సాయిరెడ్డి, వైసీపీ నేతలు

Sai Reddy stuck in lift: స్మృతివనం లిఫ్ట్‌లో చిక్కుకున్న సాయిరెడ్డి, వైసీపీ నేతలు

Sarath chandra.B HT Telugu

16 January 2024, 17:19 IST

    • Sai Reddy stuck in lift: విజయవాడలో ఏపీ ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మించిన అంబేడ్కర్ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన ఎంపీ సాయిరెడ్డి కాసేపు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. దీంతో అధికారులు కాసేపు హైరానా పడ్డారు. 
అంబేడ్కర్ స్మృతి వనంలో ప్రజా ప్రతినిధులు
అంబేడ్కర్ స్మృతి వనంలో ప్రజా ప్రతినిధులు

అంబేడ్కర్ స్మృతి వనంలో ప్రజా ప్రతినిధులు

Sai Reddy stuck in lift: ఏపీ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ నిధులతో విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మించిన అంబేడ్కర్‌ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన ఎంపీ సాయిరెడ్డి కాసేపు లిఫ్ట్‌లో చిక్కుకుపోవడం అధికారుల్ని కంగారు పెట్టించింది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఈ నెల 19వ తేదీన విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని సిఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయిరెడ్డితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఇతర ప్రజా ప్రతినిధులు స్మృతి వనం నిర్మాణాన్ని పరిశీలించారు.

స్మృతి వనాన్ని పరిశీలించడానికి లోపలకు వెళ్లిన ముఖ్య నాయకులు విగ్రహం ఉన్న భాగానికి చేరేందుకు లిఫ్ట్‌లో వెళుతున్న క్రమంలో కాసేపు మొరాయించినట్టు తెలుస్తోంది. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్‌ ఆగినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపటికి లిఫ్ట్‌ పని చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అంబేడ్కర్‌ లేకపోతే…

దేశంలోని దళిత, బలహీన, బడుగు వర్గాలకు ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ భారతదేశంలో పుట్టి ఉండకపోతే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో కుల, వర్ణ వివక్ష ఇప్పటికీ కొనసాగుతూ ఉండేదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

స్వరాజ్య మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో నిర్మిస్తున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పనులను ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో నిర్వహించనున్న భహిరంగ సభ ఏర్పాట్లను సాయిరెడ్డి మంగళవారం పరిశీలించారు.

విగ్రహ ప్రారంభోత్సవ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విగ్రహ నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన థియేటర్లో అంబేద్కర్ జీవిత గాధను సమగ్రంగా వివరించేలా రూపొందించిన లఘు చిత్రాన్ని ఆయన వీక్షించారు.

ఈనెల 19వ తేదీ నాలుగు గంటలకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు.

గత కొన్ని శతాబ్దాలుగా దళితుల పట్ల సమాజం చూపుతున్న వివక్ష, అస్మృశ్యత వంటి అంశాలను పటా పంచలు చేస్తూ రాష్ట్రంలో 81 అడుగుల వేదికపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట తో దళితులు సమాజంలో ఆత్మగౌరవంతో బతికే ఒక సమ సమాజ భావజాలాన్ని పెంపొందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సంకల్పించిందని తెలిపారు.

విగ్రహ ప్రతిష్టాపన చేసిన ప్రాంగణంలో ఆడిటోరియం, అంబేద్కర్ జీవిత కాలంలో వినియోగించిన వస్తువులతో మ్యూజియం, లేజర్ షో వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ సామాజిక న్యాయ మహా శిల్ప ప్రాంగణం ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

దేశంలో, రాష్ట్రంలో వ్యవస్థలు సక్రమంగా తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటే అందుకు కారణం ఆనాటి రాజ్యాంగమే కారణమన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానమే తమ ప్రభుత్వానికి మార్గదర్శకమన్నారు.

దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ వంటి ఒక మహా పురుషుని జీవిత గాధ తెలుసుకునేందుకు ఈ సామాజిక న్యాయ మహా శిల్పం ఒక దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా సమతాసభ ఏర్పాటు చేశామని చెప్పారు. సమతా సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలిరానున్నారని లక్షా 20 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

సాయంత్రం 6 గంటలకు లేజర్ షో లేదా డ్రోన్ షో ఉంటుందన్నారు. 20వ తేదీ నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. దార్శనికుడి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఆహ్వానం అవసరం లేదని చరిత్రలో గొప్ప పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహం నిలిచిపోతుందని విజయసాయిరెడ్డి చెప్పారు.

తదుపరి వ్యాసం