తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Condolenses :కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతులకు పరిహారం….

PM Condolenses :కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతులకు పరిహారం….

HT Telugu Desk HT Telugu

29 December 2022, 11:42 IST

    • PM Condolenses నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధానమంత్రి  సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి సైతం కందుకూరు దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 
కందుకూరు దుర్ఘటనపై ప్రధాని సంతాపం
కందుకూరు దుర్ఘటనపై ప్రధాని సంతాపం

కందుకూరు దుర్ఘటనపై ప్రధాని సంతాపం

PM Condolenses నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2.లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాన మంత్రి స‍హాయ నిధి నుంచి ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల పరిహారాన్నిప్రకటించారు. ️ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. ️ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

మరోవైపు కందుకూరు ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. దుర్ఘటనలో మరణించివారికి రూ.2 లక్షలు, , గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు.

గవర్నర్ సంతాపం…..

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.

టీడీపీ నాయకుల విరాళాలు….

కందుకూరులో చంద్రబాబు పర్యటనలో తొక్కిసలాట జరిగి, మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున సాయం అందిస్తామని విజయ నగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బేబినాయన, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులు ప్రకటించారు.

కందుకూరులో మృతి చెందిన కుటుంబాలకు కేశినేని ఫౌండేషన్ తరపున ఒక్కొక్కరికి రూ.50వేలు, గాయపడిన ఒక్కొక్కరికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేశనేని చిన్ని ప్రకటించారు.

మరోవైపు కందుకూరు ఘటనపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణయించారు. పార్టీ నుంచి ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించారు. తమ వంతుగా మరో రూ. 8 లక్షలు ఇస్తామని పలువరు నేతలు ప్రకటించారు. మొత్తంగా టీడీపీ తరపున రూ.23 లక్షలు సాయం చేయాలని నిర్ణయించారు.

తదుపరి వ్యాసం