తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Naralokesh Yuvagalam: నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం

Naralokesh Yuvagalam: నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం

Sarath chandra.B HT Telugu

18 December 2023, 7:54 IST

    • Naralokesh Yuvagalam: టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం నేటితో ముగియనుంది.  ఈ ఏడాది జనవరిలో కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర నేడు విశాఖ నగర శివారునన్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్‌గేట్‌ సమీపంలో ముగుస్తుంది. 
నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

నేటితో ముగియనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

Naralokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం నేటితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభించిన పాదయాత్రను నేటితోముగించనున్నారు. 226రోజుల్లో 3132 కి.మీ.ల పొడవున యువగళం పాదయాత్ర సాగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌,రిమాండ్ నేపథ్యంలో మధ్యలో కొంత కాలం పాదయాత్ర నిలిచిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

జగన్మోహన్ రెడ్డి అపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది.

రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది.

యువగళం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన తర్వాత ఏకబిగిన సాగింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షాన్నిలో సైతం యాత్రను కొనసాగించారు.

పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా యువనేత లెక్కచేయలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో లక్ష్యంగా దిశగా పయనించారు యువనేత లోకేష్.

యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగసభలు, 155ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు.

రాయలసీమలో రికార్డు సృష్టించిన యువగళం

గతంలో ఏ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో లోకేష్ రికార్డు సృష్టించారు. 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ యువనేత పాదయాత్ర సాగింది.

ఉత్తరాంధ్ర ప్రజల బ్రహ్మరథం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేష్ అనివార్య పరిస్థితుల్లో విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది.ఉమ్మడి విశాఖ జిల్లాలో 7రోజులు, 113 కి.మీ.లు మాత్రమే యాత్ర కొనసాగినప్పటికీ ప్రజలు అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టారు.

పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర సాగింది. లక్షలాది ప్రజలు, అభిమానులు, మహిళలు, టిడిపి-జనసేన కార్యకర్తలు యువనేతకు నీరాజనాలు పట్టారు. మహిళలు, బిసిలు, రిటైర్డ్ ఉద్యోగులు, మత్స్యకారులు, యాదవులు, అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా ఉద్యోగులతో లోకేష్ ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతైన అధ్యయనం చేసి, పలు హామీలు ఇచ్చారు.

ఉభయగోదావరి జిల్లాల్లో జేజేలు

చైతన్యానికి మారుపేరైన ఉభయగోదావరి జిల్లాల్లో 17 నియోజకవర్గాల పరిధిలో 23రోజులపాటు సాగిన యువగళం పాదయాత్ర జనజాతరను తలపించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8నియోజకవర్గాలు, 11రోజులు, 225.5 కి.మీలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాలు, 12రోజులు 178.5 కి.మీ.లు కలిపి మొత్తం 404 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర కొనసాగింది.

ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 97అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమేగాక, ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ వచ్చారు.

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ఒకే ప్రాంతంలో పాదయాత్రను ముగిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ‘వస్తున్నా..మీకోసం’ పేరిట హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 208 రోజులపాటు 2,817 కిలోమీటర్లు నడిచారు. 2013 ఏప్రిల్‌ 27న గాజువాక ప్రాంతంలో యాత్రను ముగించారు.

పైలాన్ ఆవిష్కరించనున్న లోకేష్a

బాబు పాదయాత్ర మగింపునకు గుర్తుగా విశాఖ నగర శివారునన్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్‌గేట్‌ సమీపాన శివాజీనగర్‌ ప్రాంతంలో భారీ పైలాన్‌ను నిర్మించారు. ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో యువగళం పేరుతో ఆయన తనయుడు లోకేశ్‌ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర సోమవారం అదే అగనంపూడి టోల్‌గేటు సమీపాన ముగియనుంది. శివాజీనగర్‌ వద్ద నిర్మించిన పైలాన్‌ పక్కనే మరో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

తదుపరి వ్యాసం