తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam: మే 25 నుంచి శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

Srisailam: మే 25 నుంచి శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

HT Telugu Desk HT Telugu

20 May 2023, 6:46 IST

    • Maha Kumbhabhishekam in Srisailam:శ్రీశైల మహా క్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. మే 25 నుంచి 31 వరకు మహా కుంభాభిషేకం జరపనున్నారు.
మే 25-31 మధ్య శ్రీశైలంలో మహా కుంభాభిషేకం
మే 25-31 మధ్య శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

మే 25-31 మధ్య శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

Maha Kumbhabhishekam in Srisailam 2023: మే 25వ తేదీ శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహా కుంభాభిషేకం మహోత్సవాలు జరగనున్నాయి. మే 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈమహా కుంభాభిషేకం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఆలయంలోని శివాజీ గోపురంపై కలశాల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి చేపట్టడమే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే నడుస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న శాస్త్రం ప్రకారం స్మార్త, శైవాగమం ప్రకారం మహా కుంభాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

మరోవైపు కొత్తగా నిర్మించిన శివాజీ గోపురానికి స్వర్ణ తాపడ కలశాలను పునఃప్రతిష్టించనున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో కూడా జీర్ణోద్దరణ చేసిన మూడు శివాలయాల్లో శివలింగాలను పునఃప్రతిష్టించనున్నారు. వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన ఐదుగురు పీఠాధిపతులు ఈ మహా కుంభాభిషేకంలో పాల్గొంటారని ఆలయాధికారులు తెలిపారు. మహా కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక యాగశాల, హోమగుండాలను నిర్మించే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మహా కుంభాభిషేకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరు కానుండడంతో శివాజీ గోపురానికి తాత్కాలిక లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలంలో నూతనంగా 220 గదులతో నిర్మించిన గణేష్ సదన్ వసతి సముదాయాన్ని ఈ నెల 30 వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో 75 కోట్ల రూపాయలతో అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మించడానికి జగన్ భూమి పూజ చేయనున్నారు.

Tiruchanoor Padmavathi Ammavari Teppotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ తెప్పోత్సవాలు మే 31 వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ ఉత్సవాల్లో శ్రీ అలిమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుంది. పద్మసరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. మే 31వ తేదీ మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. అమ్మవారికి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు గజవాహనం, జూన్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం