తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : పెడనలో వారాహి యాత్రపై రాళ్ల దాడికి వైసీపీ కుట్ర, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : పెడనలో వారాహి యాత్రపై రాళ్ల దాడికి వైసీపీ కుట్ర, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

03 October 2023, 19:38 IST

    • Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పెడన నియోజకవర్గంలో వారాహి యాత్రపై రాళ్ల దాడి చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులు పెడన వారాహి యాత్రలో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడినా జనసేన శ్రేణులు ఓపిక పట్టాలని సూచించారు. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా సంమయనం పాటించాలని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి ఎవరైన రాళ్ల దాడి చేసినా వారిపై తిరిగి దాడి చేయొద్దని, పట్టుకుని పోలీసులకు అప్పగించాలని సూచించారు. పెడనలో జరిగే పరిణామాలకు డీజీపీ, ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెడనలో రెండు, మూడు వేలమంది రౌడీమూకలు రాళ్ల దాడుల చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం జగన్ ఇలాంటి వేషాలేస్తే భవిష్యత్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

పేదల ఇళ్లు కూల్చేసి క్లాస్ వార్ అంటున్నారు

జనవాణికి రాయలసీమ నుంచి మచిలీపట్నం వచ్చి సమస్యలు చెబుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అణగారిన వర్గానికి నాయకుడు అని చెప్పుకుంటున్న సీఎం జగన్... పేదలను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కూడా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం పేదల ఇళ్లు కూల్చేశారని మండిపడ్డారు. క్లాస్ వార్ అంటున్న సీఎం జగన్.. మాటలు చెబితే కాదు అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని హితవు పలికారు. నంద్యాలలో వైసీపీ నేతలు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాలకు బాధితుల వద్ద ఉన్న ఫొటోలే నిదర్శనం అన్నారు. వెయ్యి మంది నివాసాలను ప్రొక్లెయిన్లతో కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన శ్రేణులు అడ్డుకుంటే చర్యలు ఆపారన్నారు. అన్యాయంగా ఇళ్లను కూల్చివేస్తే భవిష్యత్‌లో చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ కు అస్వస్థత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్... వెన్నునొప్పితో కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు జనవాణిలో పాల్గొన్న పవన్.. ప్రజల సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ను వెన్ను నొప్పి మొదలైంది. కాసేపు విశ్రాంతి తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో.. జనవాణి కార్యక్రమం మధ్యలోనే పవన్ వెళ్లిపోయారు. పవన్ ఆరోగ్యంపై జనసైనికులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తదుపరి వ్యాసం