తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Varahi Yatra : రేపటి నుంచి పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర, షెడ్యూల్ విడుదల

Janasena Varahi Yatra : రేపటి నుంచి పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర, షెడ్యూల్ విడుదల

30 September 2023, 20:49 IST

    • Janasena Varahi Yatra : జనసేన వారాహి నాల్గో విడత యాత్ర రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. ఆదివారం అవనిగడ్డలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Janasena Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నాల్గో విడత షెడ్యూల్ ఖరారైంది. రేపటి నుంచి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

షెడ్యూల్ ఇలా!

  • అక్టోబర్ 1- అవనిగడ్డలో బహిరంగ సభ -యక్కటి దివాకర్ వీణాదేవి కళాశాల ప్రాంగణం
  • అక్టోబర్ 2- మచిలీపట్నం నాయకులతో సమావేశం
  • అక్టోబర్ 3- మచిలీపట్నంలో జనవాణి
  • అక్టోబర్ 4- పెడన
  • అక్టోబర్ 5 - కైకలూరు నియోజకవర్గాల్లో పర్యటన

పవన్ ప్రసంగంపై ఉత్కంఠ

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావటంతో... జైలులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చంద్రబాబుకు బెయిల్ రావటం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నారా లోకేశ్ చుట్టూ కూడా సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే యువగళం పాదయాత్ర ఆగిపోయింది. లోకేశ్ దిల్లీలోనే మకాం వేశారు. కొద్దిరోజుల కిందటే రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిసిన పవన్.... అనంతరం లోకేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. వైసీపీని ఓడించటమే తమ లక్షమ్యని ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటికే పవన్ వారాహి యాత్రకు టీడీపీ మద్దతు తెలిపింది. దీంతో ఈసారి పవన్.. పొత్తుల విషయాలపై మరింత స్పష్టత ఇస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

వారాహి యాత్రకు తరలిరండి

జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేలా పవన్ కల్యాణ్ జనసేన తరపున వారాహి యాత్ర చేపట్టారన్నారు. నాల్గో విడత యాత్ర రేపటి(అక్టోబర్ 1) నుంచి అవనిగడ్డలో ప్రారంభం అవుతుందన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో నాల్గో విడత వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి వారాహి యాత్రకు ప్రజలు, అభిమానులు తరలిరావాలని ఆయన కోరారు. అయితే వారాహి యాత్రకు టీడీపీ మద్దతు పలకడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో వైసీపీ నేతల దారుణాలు చూశామన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలను చెబుతూ పోస్టు పెట్టినా అరెస్టు చేస్తు్న్నారన్నారు. వచ్చే ఎన్నికలకు తప్పకుండా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మరోసారి స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం