తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Vs Ministers ఏపీ ప్రభుత్వానికి జనసేనాని వరుస ప్రశ్నలు….

Pawan Kalyan Vs Ministers ఏపీ ప్రభుత్వానికి జనసేనాని వరుస ప్రశ్నలు….

HT Telugu Desk HT Telugu

10 October 2022, 13:16 IST

    • Pawan Kalyanమూడు రాజధానులకు మద్దతుగా.. విశాఖ గర్జన పేరిట ఈనెల 15న వైకాపా ఆధ్వర్యంలో రాజకీయేతర ఐకాస ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. దేనికీ గర్జనలు? అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్షంగా పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీ ప్రభుత్వానికి పవన్‌ కళ్యాణ్‌ వరుస ప్రశ్నలు
ఏపీ ప్రభుత్వానికి పవన్‌ కళ్యాణ్‌ వరుస ప్రశ్నలు

ఏపీ ప్రభుత్వానికి పవన్‌ కళ్యాణ్‌ వరుస ప్రశ్నలు

Pawan tweets ''దేనికీ గర్జనలు?.. మూడు రాజధానులతో ఇంకా అధోగతి పాల్జేయడానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా? ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేక పోయినందుకా?మత్స్యకారులకు సొంతతీరంలో వేటకు అవకాశం లేక మత్స్యకారులు గోవా, గుజరాత్‌, చెన్నై వెళ్తున్నందుకా? విశాఖపట్నంలో రుషికొండ ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకుంటున్నందుకా?దసపల్లా భూములు మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలిచ్చినందుకా?'' అని పవన్‌ ట్విట్టర్‌లో నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

గంజాయి కేసుల్లో ఏపీని మొదటి స్థానంలో నిలిపారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్విట్టర్ twitter లో ప్రభుత్వంపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

రోడ్లు వేయడం లేదని, చెత్త మీద పన్నులు వేస్తున్నారన్నారు. పీఆర్సీపై మాట మార్చారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. పోలీసులకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నారన్నారు.

ఉత్తరాంధ్రలో వలసలు ఆపలేకపోయారన్నారు. రుషికొండను ధ్వంసం చేసి భవనం నిర్మించుకుంటున్నారన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు గర్జనలా అని ప్రశ్నించారు. సంపూర్ణ మద్య నిషేధం అద్భుతంగా అమలు చేస్తున్నందుకా ..? మద్య నిషేధం ద్వారా ఏటా రూ.22వేల కోట్లు సంపాదిస్తున్నందుకా..? ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నందుకా..? రాష్ట్రాన్ని అప్పుల బాట పట్టించినందుకా..? అని పవన్ ప్రశ్నించారు..

''మూడు నగరాల్లో హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల సమూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి హామీ ఇస్తుందా?. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం హృదయపూర్వకంగా కోరుకుంటే, పంచాయతీలు, మున్సిపాలిటీ లకు ఆర్థిక అధికారాలు, నిర్ణయాధికారాలను ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలు, మున్సిపల్ అధికారులకు స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు. అన్ని అధికారాలను స్థానిక సంస్థలకు ఎందుకు బదిలీ చేయరు. ఇది నిజమైన వికేంద్రీకరణ కాదా?'' అంటూ పవన్ కళ్యాణ్(Janasena party) ట్వీట్ చేశారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లకు ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్ లు కౌంటర్ ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు వైసీపీ మంత్రులు తమదైన శైలిలో సోషల్ మీడియాలో కౌంటర్ లు వేస్తున్నారు.

దత్త తండ్రి చంద్రబాబు తరుపున దత్త పుత్రుడి పవన్ కళ్యాణ్ "మియావ్ మియావ్.! అని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Amarnath) విమర్శించారు. 'ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థమవుతుందా అంటూ మంత్రి అంబాటి రాంబాబు (ambati rambabu) కౌంటర్ ఇచ్చారు.

టాపిక్

తదుపరి వ్యాసం