తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Extra Marital Affair : భార్యతో ఎఫైర్.. ప్రియుడికి భర్త కరెంట్ షాక్.. రంగంలోకి పోలీస్ డాగ్

Extra Marital Affair : భార్యతో ఎఫైర్.. ప్రియుడికి భర్త కరెంట్ షాక్.. రంగంలోకి పోలీస్ డాగ్

HT Telugu Desk HT Telugu

30 October 2022, 22:11 IST

    • Vizianagaram Crime News : తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్నాడని మరో వ్యక్తిని భర్త చంపేశాడు. రంగంలోకి దిగిన పోలీస్ డాగ్ హంతకుడిని పట్టించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

భార్యతో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఓ వ్యక్తి పొరుగునే ఉన్న మరో వ్యక్తిని విద్యుదాఘాతంతో హతమార్చాడు. భర్తను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Inter Supply Hall Tickets : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇవాళే హాల్ టికెట్లు!

AP Aarogya Sri : ఏపీలో మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్, స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రకటన

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

విజయనగరం(Vizianagaram) జిల్లా సంతకవిటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎస్‌ఆర్‌ అగ్రహారం గ్రామ సమీపంలో బాధితుడు గోవిందరావు (28) శవమై కనిపించాడు. అయితే అతడు కొంతకాలం కిందటే.. తన కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం వైజాగ్ నగరానికి వెళ్లాడు.

ఇటీవల గోవిందరావు తన స్వగ్రామానికి ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కి హాజరయ్యాడు. మంగళవారం రాత్రి కనిపించకుండా పోయిన అతడు బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసు స్నిఫర్ డాగ్ నిందితుల ఇంటిని గుర్తించినట్లు సంతకవిటి పోలీసులు తెలిపారు. ఎస్‌ఆర్ అగ్రహారా(SR Agraharam)నికి చెందిన ఓ వివాహితతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెల్లడించారు.

మహిళ భర్త అప్పారావుకు ఇటీవలే ఎఫైర్ గురించి తెలిసింది. అతని స్నేహితుల సహాయంతో గోవిందరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం రాత్రి అప్పారావుతోపాటు కొందరు గోవిందరావును ఎస్‌ఆర్‌ అగ్రహారంలో పార్టీ కోసం ఆహ్వానించారు.

అక్కడ విద్యుదాఘాతంతో అతడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హంతకుల ఇంట్లో విద్యుదాఘాతానికి ఉపయోగించిన వస్తువులను గుర్తించడంలో పోలీస్ డాగ్ సహాయపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం