తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ammavodi Update | ఇలా చేస్తేనే 'అమ్మఒడి' డబ్బులు వస్తాయి.. చూసుకోండి

Ammavodi Update | ఇలా చేస్తేనే 'అమ్మఒడి' డబ్బులు వస్తాయి.. చూసుకోండి

HT Telugu Desk HT Telugu

27 April 2022, 16:53 IST

    • ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా.. అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై కీలక అప్ డేట్ వచ్చింది. అకౌంట్.. నెంబర్ ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే.. డబ్బులు ఖాతాలో పడవు.
అమ్మ ఒడి
అమ్మ ఒడి

అమ్మ ఒడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని.. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏటా.. జనవరిలో ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. ఈ ఏడాది జూన్ లో డబ్బులు విడుదల చేయనుంది. దీనికోసం వివరాలు సేకరించే ప్రక్రియు మొదలుపెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Bengalore Rave Party: బెంగుళూరులో రేవ్‌ పార్టీ భగ్నం, పోలీసుల అదుపులో ఏపీ రాజకీయ నేతలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

అయితే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కు లింక్ కాకపోవడంతో సమస్యలు ఉన్నాయి. రెండు మూడు అకౌంట్లు ఉండటం.., అమ్మఒడి నమోదు ప్రక్రియలో పొరబాట్లు చేయడంతో డబ్బులు పడే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో.. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది.

అమ్మఒడి పథకం డబ్బుల కోసం మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు స్కూల్ లో ఇచ్చేవారు. వాటినే స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు. ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి. కానీ ఈ సంవత్సరం అలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ఎన్ రోల్ చేయాలి. NPCI అంటే.. NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి.

బ్యాంకు అకౌంట్ కు NPCIకి లింక్ చేయడమంటే.. బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయడమే. ఆధార్ తో లింక్ చేసిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే.. NPCI కి లింక్ చేసి ఉంటుంది. ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్లు.. ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. ఉన్న బ్యాంకు అకౌంట్లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం తెలిసి ఉండాలి.

ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉందని.., దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు. రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

సంబంధిత కథనం

తదుపరి వ్యాసం