తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vellampalli : ప్రజారాజ్యం విలీనానికి పవన్ కళ్యాణ్ కారకుడు…. వెల్లంపల్లి

Vellampalli : ప్రజారాజ్యం విలీనానికి పవన్ కళ్యాణ్ కారకుడు…. వెల్లంపల్లి

HT Telugu Desk HT Telugu

23 August 2022, 12:54 IST

    • ప్రజారాజ్యం పార్టీ విలీనానికి మొదటి కారకుడు పవన్ కళ్యాణ్‌ అని మాజీ మంత్రి Vellampalli శ్రీనివాస్ ఆరోపించారు. పార్టీ అధికారంలోకి రాలేదని చిరంజీవిని వదిలేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు అవసరమైనపుడు కీ ఇస్తే వచ్చిమాట్లాడే మరబొమ్మగా పవన్ మారిపోయారని విమర్శించారు. 
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ ఫొటో)
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ ఫొటో)

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(ఫైల్ ఫొటో)

ప్రజారాజ్యంలో అసలైన కోవర్టు పవన్‌ కళ్యాణ్ అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ Vellampalli ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీకి 18సీట్లు రాగానే పవన్ కళ్యాణ్‌ పార్టీని వదిలేసి పోయారని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

చిరంజీవి ఎన్నికల్లో 18సీట్లు పరిమితం అయితే ఆయన్ని వదిలేసి మొదట బయటకు వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్‌ అని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, యువరాజ్యం కీలక బాధ్యతలు అప్పగిస్తే పవన్ కళ్యాణ్ చేసిందేమిటని ప్రశ్నించారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసినా ఎమ్మెల్యేగా తాను చిరంజీవి వెంటే కొనసాగానని, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆయన వెంట కొనసాగలేదని ప్రశ్నించారు. తనతో పాటు ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన 18మంది ఎమ్మెల్యేలు చివరి వరకు చిరంజీవితోనే ఉన్నామని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని పవన్ కళ్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదనిVellampalliవెల్లంపల్లి నిలదీశారు.

టీడీపీకి అసలైన కోవర్టు పవన్ కళ్యాణ్ అని, ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారకుడు పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా చిరంజీవితో పాటే చివరి వరకు కొనసాగారని పవన్ మాత్రమే ఆ‍యన్ని వదిలేసి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీలో చిరంజీవితో పాటు ఎమ్మెల్యేలంతా కొనసాగారు తప్ప ఎవరి దారి వారు చూసుకోలేదన్నారు. అధికారం రాలేదని సొంత అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ అని విమర్శించారు. గతం మొత్తం ప్రజలు మర్చిపోయారని, చిరంజీవి-జగన్ దగ్గరవుతున్నారనే ఆలోచనతో ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. చంద్రబాబుకు అవసరమైన సమయంలో మాత్రమే పవన్ కళ్యాణ‌ బయటకు వచ్చి మాట్లాడతారని ఆరోపించారు. కనీసం కార్పొరేటర్‌గా గెలిచే సత్తా కూడా పవన్‌కు లేదని ఎద్దేవా చేశారు.

ప్రజారాజ్యం విలీనానికి కొందరు కోవర్టులు కారణమని ఆదివారం పిఏసీ మీటింగ్‌లో పవన్ ఆరోపించారు. ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మోసాల వల్లే ప్రజారాజ్యాన్ని విలీనం చేయాల్సి వచ్చిందని ఆరోపించారు. పవన్ ఆరోపణల నేపథ్యంలో 2009లో ఆ పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఎన్నికైన Vellampalli శ్రీనివాస్ పవన్‌పై విమర్శలు గుప్పించారు.

టాపిక్

తదుపరి వ్యాసం