తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni : సొంత పార్టీలోనే కుట్రదారులున్నారు…. బాలినేని

Balineni : సొంత పార్టీలోనే కుట్రదారులున్నారు…. బాలినేని

HT Telugu Desk HT Telugu

28 June 2022, 7:57 IST

    • టీడీపీ నేతలో  కలిసి వైసీపీకి చెందిన ఓ నాయకుడు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని సీఎం బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల కలకలం రేపిన ఫోన్‌ కాల్స్‌ వ్యవహారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ విజ్ఞప్తితో కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు బాలినేని ప్రకటించారు.  తనకు వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 
సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ
సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ

సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ

వైసీపీలో తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల మద్యం మత్తులో జనసేన పార్టీ నాయకురాలితో మాట్లాడారనే ఆరోపణల నేపథ్యంలో బాలినేని పలువురిపై కేసులు నమోదు చేయించారు. తనకు సంబంధం లేకపోయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, మాజీ మునిసిపల్ ఛైర్మన్ మంత్రి శ్రీనివాసరావులతో కలిసి సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

మద్యం సేవించి జనసేన మహిళకు ఫోన్ చేశారనే ప్రచారం వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని ఆరోపించారు.అల్లూరుకు చెందిన ఓ మహిళకు , టీడీపీ నేతలు దామచర్ల జనార్థన్‌,మాజీ మునిసిపల్ ఛైర్మన్ శ్రీనుల ప్రోత్సాహం ఉందని బాలినేని ఆరోపించారు. ఈ కుట్రలో వైసీపీకి చెందిన కీలక నేత కూడా ఉన్నారని, తనను రాజకీయంగా దిగజార్చేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తనను హవాలా మంత్రి అని ప్రచారం చేయడం వెనుక కూడా టీడీపీ నేతల ప్రోత్సాహం ఉందన్నారు. తన కుమారుడు ప్రణీత్ రెడ్డిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ కొందరు కావాలని చేయిస్తున్నారని ఆరోపించారు.

తప్పు చేసినట్లు రుజువైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు.తనను రెచ్చ గొట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్న మహిళ వెనుక ఎవరున్నారో పోలీసు దర్యాప్తుల తెలుస్తుందన్నారు. ఓపిక నశించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తాపై మద్యం మత్తులో ఎవరో దాడి చేస్తే దానిని కూడా తాను చేయించినట్లు ప్రచారం చేశారని, సుబ్బారావు గుప్తా ఏం మాట్లాడాలో కూడా టీడీపీ నేతలు శిక్షణ ఇచ్చి పంపారని ఆరోపించారు. జనసేన మహిళ కుటుంబ వివాదాల్లోకి తనను లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాపై గట్టి పట్టుంది. మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోవడంతో కినుక వహించడంతో ముఖ్యమంత్రి స్వయంగా బుజ్జగించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల బాధ్యతలు అప్పగించారు. బాలినేనికి టీడీపీతో పాటు సొంత పార్టీలో కూడా రాజకీయ ప్రత్యర్ధులున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయనే విమర్శలు కూడా లేకపోలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం